అదృష్టం అనేది ఎప్పుడు. ఎలా వరిస్తుందో ఊహించలేము. అదృష్టం మనల్ని వరించినపుడు కొన్ని సార్లు మన జీవితమే మారిపోతుంది. అంతేకాదు.. జీవితం ఎప్పుడూ లేని విధంగా తయారవుతుంది.
అదృష్టం అనేది ఎప్పుడు.. ఏ విధంగా.. ఏ రూపంలో వస్తుందో చెప్పడం కష్టం. కొన్ని సార్లు కష్టపడినా రాని అవకాశం కష్టపడకుండానే అదృష్టం రూపంలో వస్తుంది. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అదృష్టం మురికి వాడలో పుట్టిన 14 ఏళ్ళ బాలికను వరించింది. దీంతో ఆ బాలిక జీవితం ఎవ్వరూ ఊహించని రీతిలో మలుపు తిరిగింది. వినడానికి షాకింగ్ గా ఉన్నా .. ఆ బాలిక జీవితం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. స్లమ్ ఏరియాలో ఉంటూ మల్టీనేషనల్ కంపెనీలనే ఆకర్షించిన ఆ బాలిక ఎవరు? ఏంటి అన్న పూర్తి వివరాలు మీకోసం..
మలీషా ఖర్వాది నిరుపేద కుటుంబం. ముంబైలోని ధారావి మురకివాడల్లో ఆమె నివసిస్తూ ఉంటుంది. సరైన సౌకర్యాలు లేని చోట ఉంటుంది. మూడేళ్ల క్రితం ఆమెను మొట్టమొదటగా హాలీవుడ్ నటుడు రాబర్ట్ హాఫ్ గుర్తించారు. ఆ తర్వాత ఆమె తన జీవితం గురించి వెనక్కి చూసుకోలేదు. ఇటీవలే ఓ ప్రఖ్యాత లగ్జరీ బ్యూటీ బ్రాండ్ ఫారెస్ట్ ఎసెన్షియల్స్ ఒప్పందాన్ని ఏర్పరచుకుంది. ఆ సంస్థ మెుదలు పెట్టిన తర్వాత ఆ యువతి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యింది.
అంతేకాదు! సోషల్ సర్వీస్‌లోనూ మలీషా ముందుంటోంది. ఆమె రెండు హాలీవుడ్ సినిమాల్లో అవకాశం దక్కించుకుంది. అర్సాలా ఖురేషి, జాన్ సాగూ రూపొందించిన లివ్ యువర్ ఫెయిరీ టేల్ అనే షార్ట్ ఫిల్మ్ లో కూడా నటించింది. ప్రస్తుతం ఆమె స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, మురికివాడనుంచి హాలీవుడ్‌లో సినిమా చేసే స్థాయికి ఎదిగిన మలీషా స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.