భక్తి మార్గంలో మునిగిపోయిన కొందరు వ్యక్తులు తమను తాము మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. కానీ భక్తిశ్రద్దలతో పూజలు చేయడంలో తప్పులేదు.. కానీ అదే భక్తి ధ్యాసలో పడిపోయిన ఓ వ్యక్తి తీర్థంతో పాటు దేవుడి విగ్రహాన్ని మింగాడు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ఇటీవల కర్ణాటకలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలేం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం.
అది కర్ణాటకలోని బెళగావి. ఇదే ప్రాంతానికి చెందిన ఓ 45 ఏళ్ల వ్యక్తి రోజూ తన ఆరాధ్య దైవం బాలకృష్ణుడుని పూజించేవాడు. ఇటీవల పూజ చేస్తుండగా ఆ వ్యక్తి తీర్థంతో పాటు తనకు తెలియకుండానే కృష్ణుడి విగ్రహాన్ని మింగేశాడు. అయితే కొద్దిసేపటి తర్వాత అతని గొంతులో విపరీతమైన నొప్పి రావడం మొదలైంది. మాములే అంటూ ఊరుకున్నాడు. ఇక సమయం గడుస్తున్న కొద్ది అతని గొంతులో నొప్పి విపరీతంగా రావడం మొదలైంది. ఏం జరిగిందని ఆస్పత్రికి వెళ్లాడు.
ఇది కూడా చదవండి: Vijayawada: తన కోరికను భర్త నెరవేర్చడం లేదు అనుకుంది.. ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా!
తీరా గొంతులో ఏదో ఉందని వైద్యులు చెప్పారు. దీంతో వెంటనే ఎక్స్ రే తీసిన వైద్యులు గొంతులో విగ్రహం ఉందని తేల్చారు. అనంతరం అతడిని బెళగావిలోని కేఎల్ఈఎస్ ఆస్పత్రికి తరలించారు. ఎండోస్కోపీ పరీక్షలు చేసిన వైద్యులు ఆహార నాళికలో ఎడమవైపు కృష్ణుడి విగ్రహం ఇరుక్కుపోయిందని నిర్ధరించారు. ఆ తర్వాత శస్త్రచికిత్స చేసి అనంతరం ఆ విగ్రహాన్ని తొలగించారు. ప్రస్తుతం అతడు క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తాజాగా కర్ణాటకలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.