చాలా మంది దేవుడిపై అపారమైన భక్తి భావాలతో ఉంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో దేవళ్లకు పూజలు నిర్వహించి.. తమను కష్టాల నుంచి గట్టేక్కించాలని కోరుకుంటారు. అయితే దేవుళ్లపై తమకు ఉన్న అపారమైన భక్తిని విన్నూత్నంగా చాటుకుంటారు. తాజాగా ఓ వ్యక్తి దేవుడిపై తనకున్న అపారమైన భక్తిని వింతగా చాటుకున్నాడు. ఏకంగా దేవతకు నాలుకను నైవేద్యంగా సమర్పించాడు.
చాలా మంది దేవుడిపై అపారమైన భక్తి భావాలతో ఉంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో దేవళ్లకు పూజలు నిర్వహించి.. తమను కష్టాల నుంచి గట్టేక్కించాలని కోరుకుంటారు. అయితే దేవుళ్లపై తమకు ఉన్న అపారమైన భక్తిని విన్నూత్నంగా చాటుకుంటారు. కొందరు మోకాళ్లపై, మరికొందరు రోడ్డుపై పొర్లు దండాలు పెట్టుకుంటా స్వామి వారిని దర్శించుకుంటారు. అలానే వివిధ రకాల నైవేద్యాలను దేవళ్లుకు సమర్పిస్తుంటారు. అయితే తాజాగా ఓ వ్యక్తి దేవుడిపై తనకున్న అపారమైన భక్తిని వింతగా చాటుకున్నాడు. ఏకంగా దేవతకు నాలుకను నైవేద్యంగా సమర్పించాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఫతేఫుర్ కు చెందిన బాబురామ్ పాశ్వాన్(65)కు దైవ భక్తి ఎక్కువ. ఆయన ఎన్నో ఏళ్ల నుంచి దేవుళ్లకు పూజలు చేసేవాడు. సప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఫతేపూర్ ప్రాంతంలోని గ్రామాల్లో ఆలయాల్లో అమ్మవారికి పూజలు జరుగుతున్నాయి. అలానే గుగౌలి గ్రామ సమీపంలోని శివభవాని మాత ఆలయంలో కూడా పూజలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రి సప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని పాశ్వాన్ గుగౌలి గ్రామంలోని అమ్మవారి ఆలయానికి వెళ్లాడు.
అమ్మవారిని దర్శించుకున్న బాబురామ్.. అకస్మాత్తుగా తన నాలుకలోని సగ భాగాన్ని కోసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాడు. బాబురామ్ చేసిన పనికి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. నాలుకను గాయపరుచుకున్న బాబురామ్ కి తీవ్రంగా రక్తస్రావం జరిగింది. రక్తపు మడుగులో పడి ఉన్న వృద్ధుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాబురామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కళ్యాణ్ పూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికులను అడిగి వివరాలు సేకరించారు.
దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధుడు తన నాలుకను కోసుకుని మాత ఆలయంలో సమర్పించాడని స్థానికులు అంటున్నారు. నాలుక కోసుకున్న వార్త ఆ ప్రాంతమంతా మంటలా వ్యాపించింది. అనంతరం ఆలయ పరిసరాల్లో, చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద ఎత్తున గుమిగూడారు. మరో భక్త కన్నప్పలా ఉన్నాడంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.