సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో అద్భుతమైన వీడియోలో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రెటీలు, పొలిటీషియన్స్ కి సంబంధించిన వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.
ఇటీవల సోషల్ మీడియా వచ్చిన్పటి నుంచి ఎన్నో రకాల వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. కొన్ని నవ్వుపుట్టించే విధంగా ఉంటే.. కొన్ని కన్నీరు పెట్టించే విధంగా ఉంటున్నాయి. మరికొన్ని వీడియోలు చూస్తుంటే భావోద్వేగానికి గురయ్యేవిధంగా ఉంటున్నాయి. ఇక సెలబ్రెటీలు, రాజకీయ నాయకులకు సంబంధించిన వార్తలు కానీ.. వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఓ దివ్యాంగురాలు చూపించిన ప్రేమాభిమానానికి మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భావోద్వేగానికి గురైన చేసిన ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నీస్ జలగావ్ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో బుధవారం ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ దివ్యాంగురాలు చూపించిన ఆదరాభిమానానికి ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రాష్ట్రంలోని జలగావ్ జిల్లాలో కొంతమంది ప్రత్యేక వ్యక్తుల కోసం ‘దీప్తిస్తంబ్ ఫౌండేషన్’నిర్వహించిన కార్యక్రమంలో దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగత కార్యక్రమాలు పలికారు.. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
ఓ వికరాంగులైన యువతి నేలపై కూర్చొని ఉండగా దేవేంద్ర ఫడ్నవీస్ ఆమెతో పాటు నేలపై కూర్చున్నారు. ఆ యువతి కాలి బొటన వేలితో ప్లేట్ లోని తిలకం తీసి ఆయన నుదిటిన బొట్టు పెట్టింది. అంతేకాదు ఆదే వేళ్లతో హారతి ప్లేట్ తీసుకొని ఆయనకు హారతి కూడా ఇచ్చింది. ఇదంతా చూస్తున్న వాళ్లు చాలా ఎమోషన్ కి గురయ్యారు. అదే సమయంలో దేవేంద్ర ఫడ్నవీస్ కళ్లు చెమర్చాయి.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన కొన్నిఫోటోలు ఫడ్నవీస్ ట్విటర్ ద్వారా పంచుకొని చాలా ఎమోషన్ అయ్యారు.
‘ఇప్పటి వరకు నా జీవితంలో ఎందరో తల్లులు, సోదరీమణులు నన్ను ఆశీర్వదించారు.. నా నుదిటిన తిలకం దిద్దారు. ఈసారి నాకు ఓ సోదరి తన బొటనవేలుతో నా నుదిటిపై తిలకం దిద్దింది. అయితే అది చేతితో కాదు.. తన కాలి బొటనవేలుతో.. అంతేకాదు నాకు హారతి కూడా ఇచ్చింది. జీవితంలో ఇలాంటి మధరమైన క్షణాలు తీవ్ర భావోద్వేగానికి గురి చేస్తాయి. ఆ సమయంలో నా కళ్లు చెమ్మగిల్లాయి. ఆ సమయంలో ఆమె ముఖంలో చిరునవ్వు, కళ్లలో మెరుపు నాకు కనిపించింది.. తనకు ఎవరి జాలీ, దయా అక్కరలేదు.. ఎలాంటి పరిస్థితులనైనా నేను అధిగమిస్తాను’ అన్న ధీమా కనిపించింది. చెల్లీ నీ ప్రతిపోరాటంలోనూ నీకు అండగా ఉంటా అంటూ భరోరా ఇస్తున్నా అని తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
आज तक कई माताओं-बहनों ने आशीर्वाद स्वरूपी आरती की, तिलक लगाया।
आज भी उसी भावना के साथ एक अंगूठा मेरे माथे पर तिलक लगाने के लिए पहुंचा… पर इस बार ये हाथ का नहीं पांव का अंगूठा था।
जीवन में आने वाले ऐसे क्षण झकझोर देते हैं, आँखों को नम कर देते हैं, पर सिर्फ कुछ पल के लिए।… pic.twitter.com/pqpqeO3Kbo— Devendra Fadnavis (@Dev_Fadnavis) June 27, 2023