కొన్నేళ్ల క్రితం దేశ రాజధాని నడి బొడ్డులో.. మానవ రూపంలో ఉన్న మృగాళ్లు.. నడి రోడ్డు మీద.. ఓ అమాయకురాలిపై అత్యంత హేయమైన రీతిలో అత్యాచారం చేశారు. రోజుల తరబడి.. ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి ఇక తన వల్ల కాదంటూ.. ఈ రాక్షస లోకంలో బతకలేనంటూ వెళ్లిపోయింది. ఆ ఘటన దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కదిలించింది. పార్లమెంటు అత్యాచార ఘటనలకు వ్యతిరేకంగా నిర్భయ చట్టం తీసుకువచ్చింది. కానీ ఏ చట్టం కూడా మృగాళ్లను భయపెట్టడం లేదు. రోజు రోజుకు సమాజంలో అత్యాచార ఘటనలు పెరుగుతున్నాయి.
తాజాగా ఢిల్లీలో ఓ హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది. అత్యాచార బాధితురాలికి అండగా నిలవాల్సింది పోయి.. ఆమెకే శిక్ష విధించారు. బాధితురాలి మెడలో చెప్పుల దండ వేసి.. అర గుండు చేసి.. ముఖానికి నల్ల రంగు పూసి.. ఊరేగించడమే కాక ఆమె మీద దాడి చేశారు. ఇందుకు సంబంధించి వీడియో వైరల్ కావడంతో.. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాన్నీ ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్(డీసీడబ్ల్యూ) గా తీసుకుంది. బాధితురాలిని హింసించిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది.
డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ బాధితురాలిని కలిసి.. ఆమెకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా స్వాతి మలివాల్ ఓ ట్వీట్ చేశారు. ‘‘కస్తూరిబా నగర్ కు చెందిన కొందరు అక్రమ మద్యం అమ్మంకదారులు కొందరు 20 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందుతులు, బాధితురాలిని ఇంటి నుంచి కిడ్నాప్ చేసి.. ఈ దారుణానికి పాల్పడ్డారు. నిందితులతో పాటు ఉన్న మహిళలు దారుణాన్ని అడ్డుకోవాల్సింది పోయి.. అత్యాచారం చేయాల్సిందిగా నిందితులను ప్రోత్సాహించారు. అనంతరం బాధితురాలి మెడలో చెప్పుల దండ వేసి.. అర గుండు చేసి.. ముఖానికి నల్ల రంగు పూసి ఊరేగించారు. ఆమెపై దాడి కూడా చేశారు. ఈ అమానుష ఘటన పట్ల మనందరం సిగ్గుపడాలి’’ అని స్వాతి మలివాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
कस्तूरबा नगर में 20 साल की लड़की का अवैध शराब बेचने वालों द्वारा गैंगरेप किया गया, उसे गंजा कर, चप्पल की माला पहना पूरे इलाक़े में मुँह काला करके घुमाया। मैं दिल्ली पुलिस को नोटिस जारी कर रही हूँ। सब अपराधी आदमी औरतों को अरेस्ट किया जाए और लड़की और उसके परिवार को सुरक्षा दी जाए। pic.twitter.com/4ExXufDaO3
— Swati Maliwal (@SwatiJaiHind) January 27, 2022
అంతేకాక ‘‘ఈ దారుణ ఘటనలో భాగస్వామి అయిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాల్సిందిగా ఢిల్లీ పోలీసులను ఆదేశిస్తున్నాను. బాధితురాలికి, ఆమె కుటుంబానికి రక్షణ కల్పించాల్సిందిగా కోరుతున్నాను’’ అని తెలిపారు స్వాతి మలివాల్. బాధిత మహిళ వెంట ఓ యువకుడు తిరిగేవాడని.. అతను గతేడాది నవంబర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. అతని చావుకు కారణాలు ఏమైనప్పటికి బాధితురాలి వల్లే ప్రాణాలు తీసుకున్నాడని యువకుడి కుటుంబ సభ్యులు భావించారు. అప్పటి నుంచి బాధిత మహిళపై శత్రుత్వం పెంచుకున్నారు. ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకున్నారు. గణతంత్రదినోత్సవం రోజు కిడ్నాప్ చేసి అటుపై అత్యాచారం చేయించిన తర్వాత ఆమెను తీవ్రంగా అవమానించారు.
ఈ దారుణంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు. ‘‘ఇది చాలా సిగ్గుచేటు. నేరస్థులకు అంత ధైర్యం ఎలా వచ్చింది? శాంతిభద్రతల పరిస్థితిపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించాలని కేంద్ర హోంమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్‌ని కోరుతున్నాను. ఇలాంటి క్రూరమైన నేరాలను, నేరస్తులను ఢిల్లీ వాసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరు’’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఈ అమానుష ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ये बेहद शर्मनाक है। अपराधियों की इतनी हिम्मत हो कैसे गई? केंद्रीय गृहमंत्री जी और उपराज्यपाल जी से मैं आग्रह करता हूँ कि पुलिस को सख़्त एक्शन लेने के निर्देश दें, क़ानून व्यवस्था पर ध्यान दें। दिल्लीवासी इस तरह के जघन्य अपराध और अपराधियों को किसी भी क़ीमत पर बर्दाश्त नहीं करेंगे। https://t.co/aAinx2Sbti
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 27, 2022