ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఒక వ్యాపార వేత్తగానే కాకుండా సామాజిన సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఎన్నో దాన ధర్మాలు చేసి ఎంతో మంది జీవితాలను నిలిపారు. ప్రజల్లో ఆయన గొప్ప పేరు సంపాదించారు. ఇటీవల ఆయనకు భారతరత్న ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఆయన చేస్తున్న సేవలను గుర్తించి రతన్‌టాటా భారతరత్న అవార్డుకు అర్హుడంటూ సామాజిక కార్యకర్త రాకేష్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి విపిన్ సంఘీ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ విచారించిన నేపథ్యంలో ఓ వ్యక్తికి దేశ అత్యున్నత అవార్డు భారతరత్న ఇవ్వాలని ప్రభుత్వ అధికారులను తాము ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. భారత రత్న అవార్డు ఇవ్వాలని ప్రభుత్వానికి న్యాయస్థానం మార్గదర్శనం ఎలా ఇవ్వగలదు.. అయినా ఇలాంటి పిటీషన్ పెట్టం ఏంటీ? అని ప్రశ్నించింది. పిల్ కొట్టివేస్తామని ధర్మాసనం చెప్పడంతో పిటీషనర్ తరఫు న్యాయవాది దాన్ని ఉపసంహరించుకున్నారు.