ఆన్‌లైన్ మోసగాళ్లు ఒంటరిగా ఉన్నా.. న్యూ ఫ్రెండ్స్ కావాలి.. కాల్ మీ ఎనీ టైమ్.. న్యూడ్‌గా కనిపిస్తా.. అని కవ్వించి.. వలపు వల విసిరి.. హనీ ట్రాప్‌లో చిక్కుకొనేలా చేస్తున్నారు . తొందరపడి మాట కలిపారో అంతే సంగతులు. సర్వం దోచేస్తారు. అంతేనా పరువు కూడా గంగలో కలిసిపోతుంది. కొన్ని సార్లు హాని ట్రాప్ కారణంగా హత్యలు జరిగాయి. ఇటీవలే హనీట్రాప్ ప్లాన్ తో ఓ వ్యాపారవేత్తను హత్య చేశారు. అయితే నిందితులు రాసిన సారీ అనే నోట్ తో వారు దొరికిపోయారు.
ఆన్‌లైన్ మోసగాళ్లు ఒంటరిగా ఉన్నా.. న్యూ ఫ్రెండ్స్ కావాలి.. కాల్ మీ ఎనీ టైమ్.. న్యూడ్‌గా కనిపిస్తా.. అని కవ్వించి.. వలపు వల విసిరి.. హనీ ట్రాప్‌లో చిక్కుకొనేలా చేస్తున్నారు . తొందరపడి మాట కలిపారో అంతే సంగతులు. సర్వం దోచేస్తారు. అంతేనా పరువు కూడా గంగలో కలిసిపోతుంది. కొన్ని సార్లు హనీ ట్రాప్ కారణంగా హత్యలు జరిగాయి. ఇటీవలే హనీట్రాప్ ప్లాన్ తో ఓ వ్యాపారవేత్తను హత్య చేశారు. అయితే నిందితుల్లోని మహిళ రాసిన సారీ అనే నోట్ వారు పోలీసులకు చిక్కేలా చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
గత నెల ఢిల్లీలో బల్జీత్ లాడ్జిలో దీపక్ సేథీ(53) అనే వ్యాపార వేత్త తన గదిలో నురగలు కక్కుతూ శవమై కనిపించారు. అయితే సమాచారం అందుకన్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అక్కడ పోలీసులకు దొరికిపోయారు. ఈ నిందితుల్లో ఒకరైన ఉషా అనే 29 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో ఆమె ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ ఉషా అని ఆమె నిక్కీ, అంజలి, నిఖిత వంటి మారుపేర్లతో బడా వ్యక్తులతో స్నేహం చేసి హోటళ్లుకు తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి దోచుకునేదని పోలీసులు తెలిపారు.
అదే ప్రణాళితోనే ఆ రోజు కూడా ఉషా.. దీపక్ సేథీని ట్రాప్ చేసి హోటల్ కి తీసుకెళ్లింది. ఐతే ఆరోజు మత్తు మందు ఓవర్ డోస్ అవ్వడంతో ఆయన మృతి చెందారు. మార్చి 30న రాత్రి దీపక్ సేథీతో కలసి ఉష గెస్ట్‌హౌస్‌కి వెళ్లిందని, అర్థరాత్రి తరువాత డబ్బు, నగలతో అక్కడి నుంచి ఉడాయించినదని పోలీసులు తెలిపారు. ఐతే మత్తు మందు డోస్ ఎక్కువ కావడంతో దీపక్ చనిపోయాడు. ఆ విషయం తెలిసి ఆమె విచారం వ్యక్తం చేస్తూ.. ‘సారీ అంటూ నోట్’ రాసిందని పోలీసులు తెలిపారు. అదే ఆమెను పోలీసులకు పట్టించేలా చేసిందని చెప్పారు. ఆ తరువాత ఆమె పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతుంది.
ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమె ఉండే లోకేషన్ ను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తనకు దీపక్ సేథీని చంపే ఉద్దేశ్యం లేదని, అందువల్లే ఆ గది నుంచి బయటకు వెళ్లే ముందు సారీ నోట్‌ని వదిలి వెళ్లినట్లు విచారణలో నిందితురాలు ఉషా తెలిపింది. అలాగే ఆమె నుంచి తీసుకున్న మొబైల్ ఫోన్, నగదు తదితర విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరి.. హనీ ట్రాప్ కారణంగా జరుగుతున్న ఇలాంటి ఘోరాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.