దేశంలో కరోనా తగ్గుముఖం పట్టింది.. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి అనుకునేలోపే మళ్లీ ఒమిక్రాన్ వేరియంట్ టెన్షన్ మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా 13 దేశాలపై దీని పంజా విసిరింది. ఇండియాలోనూ ఈ ఒమిక్రాన్ బయటపడిన విషయం తెలిసిందే. సోమవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ అని దేశాలను హెచ్చిరించింది. ఒమిక్రాన్ ఎంతో ప్రమాదకారిగా వ్యాఖ్యానిచింది. దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి లేఖ రాశారు.
కరోనా వచ్చిన తొలినాళ్లలో ఎలాగైతే అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేశామో.. అలాగే ఇప్పుడు కూడా ఒమిక్రాన్ ప్రభావం ఉన్న దేశాల నుంచి విమాన సర్వీసులు వెంటనే రద్దు చేయాలను కోరారు. ఒమిక్రాన్ విషయంలో నిర్యక్ష్యం పనికిరాదని కేజ్రీవాల్ సూచించారు. ‘కరోనా మొదటి దశ సమయంలోనూ అంతర్జాతీయ విమానాల విషయంలో చాలా ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నారు. ఎక్కువ విమానాలు ఢిల్లీలో ల్యాండ్ అవ్వడం వల్ల.. సిటీ ఎక్కువ నష్టపోయింది. పీఎం సాబ్ దయచేసి విమాన సర్వీసులను రద్దు చేయండి. ఈ విషయంలో ఎంతమాత్రం ఆలస్యం చేసినా అది ప్రమాదికారి కావచ్చు’ అంటూ అరవింద్ కేజ్రీవాల్ ప్రధానికి రాసిన లేఖలో తెలిపారు.
I have requested Hon’ble PM to immediately stop flights from those countries which are affected by new variant. Any delay could be very harmful. pic.twitter.com/UyokSGcFhU
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 28, 2021
అంతర్జాతీయ విమానాల విషయంలో ఢిల్లీ సీఎం స్పందించడం ఇదే మొదటిసారి ఏం కాదు. గతంలోనూ కేజ్రీవాల్ స్పందించారు. తాజా వేరియంట్ విషయంలో అధికారులు, ఆస్పత్రులను సీఎం అప్రమత్తం చేశారు. దానికి సంబంధించి మంగళవారం రివ్యూ చేయనున్నారు కేజ్రీవాల్. కరోనా మూడో వేవ్ రాబోతోందా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
“There have been as many plagues as wars in history, yet always plagues & wars take people equally by surprise.”
Omicron’s emergence remind us of how perilous & precarious our situation is. We should be wide awake to the threat of this virus. #WHASpecial https://t.co/QHvdd6SoGJ pic.twitter.com/lSougJ0gts— Tedros Adhanom Ghebreyesus (@DrTedros) November 29, 2021