ఇతని పేరు అష్రఫ్ నవాజ్. ఢిల్లీలోని ఓ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. పీహెచ్ డీ పూర్తి చేసిన నవాజ్ ఇటీవలే లండన్ లో తాను కోరుకున్న ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఇక తాను అనుకున్న లక్ష్యాన్ని అతి తొందరలోనే అందుకోబోతున్నాడని అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతో సంతోషించారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల కిందటే నవాజ్ తండ్రి అనారోగ్యంతో మరణించాడు. దీంతో అప్పటి నుంచి ఈ కుటుంబం భారం మొత్తాన్ని తానే మోస్తున్నాడు. ఇక లండన్ లో ఉద్యోగం సాధించడంతో తన కష్టాలు తీరాయని అనుకున్నాడు.
ఇక తొందర్లోనే ఉద్యోగ నిమిత్తం నవాజ్ లండన్ వెళ్లాల్సి ఉంది. దీని కోసం అన్ని ఏర్పాటు పూర్తి చేసుకున్నాడు. తన ఫ్రెండ్స్ ఇవ్వాలని ముందే ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఈ క్రమంలోనే నవాజ్ తో పాటు అతని స్నేహితులు మంగళవారం రాత్రి ఐఐటీ ఢిల్లీలోని ఎన్డీఏ మార్కెట్ లో సమీపంలో రోడ్డు దాటుతున్నారు. ఇదే సమయంలో అటు నుంచి వేగంగా దూసుకొచ్చి ఓ కారు రోడ్డు దాటుతున్న నవాజ్, అతని స్నేహితులను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నవాజ్ కు రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
వెంటనే స్పందించిన స్థానికులు గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ వార్త తెలుసుకున్న నవాజ్ తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. ఇక అతని స్నేహితులు కూడా నవాజ్ మరణంతో కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. మృతుడికి తల్లితో పాటు ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు. తోడుగా ఉంటాడనుకున్న కొడుకు లేకుండా పోవడంతో ఆ తల్లి, చెల్లెళ్లు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.