ప్రపంచంలోని దేశాలతో పాటు ఇండియాలో కూడా ఓమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కొత్తగా 11 ఓమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 65కి చేరింది. ఓమిక్రాన్ జమ్మూలో కూడా విజృంభిస్తోంది. ఒక్క నెలలోనే 200 పైగా ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండాపోతుంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వాలు చర్యలకు సిద్ధమవుతున్నాయి.
ఇది చదవండి : హైదరాబాద్ లో వింత వ్యాధి.. చిన్నారులపైనే ఎఫెక్ట్
క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల్లో గుంపులుగా చేరితే వైరస్ మరింత స్పీడ్‌గా వ్యాపించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో సెలబ్రేషన్స్‌పై ఆంక్షలు పెట్టేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై నిషేధం విధిస్తూ ఢిల్లీ విపత్తు నిర్వహణ విభాగం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలకు, భారీ జన సముహాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. బహిరంగ వేడుకలపై ఆంక్షలు విధించిన ఢిల్లీ ప్రభుత్వం, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
బార్‌లు, రెస్టారెంట్లు లాంటివి 50 శాతం సీటింగ్‌తో ఓపెన్ చేసుకోవచ్చని, పెళ్లిళ్లు లాంటివి ఫంక్షన్లు 200 మంది అతిథులతో జరుపుకోవచ్చని ఉత్తర్వుల్లో వెల్లడించింది. మార్కెట్లలో షాపింగ్‌కు వెళ్లే వాళ్లు మాస్క్ పెట్టుకోవడంతో పాటు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. పండుగలు, వినోద కార్యక్రమాలు, కల్చరల్ ఈవెంట్స్, మతపరమైన వేడుకలు, పొలిటికల్, స్పోర్ట్స్ ఈవెంట్స్‌కు సంబంధించి గ్యాదరింగ్స్, సమావేశాలపై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది డీడీఎంఏ. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.