పుష్ప.. పుష్ప రాజ్.. ప్రజల్లో ఈ మేనియా ఇంకా తగ్గట్లేదు. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు తగ్గేదేలే అంటున్నారు. సాధారణ ప్రజలే కాదు.. సినిమా వాళ్లు, సెలబ్రిటీలు, ఆఖరికి రాజకీయ నాయకుల నోట కూడా అదే మాట. భాషతో సంబంధం లేకుండా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైలాగులు మొత్తం వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఎన్నికల ప్రచారాల్లోనూ పుష్ప ఫీవర్ కనిపిస్తోంది. ఇటీవల కాంగ్రెస్ ఎన్నికల ప్రచారగీతాన్ని శ్రీవల్లి సాంగ్ ట్యూన్ తో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రక్షణ శాఖ మంత్రి నోట పుష్ప సినిమా డైలాగు వినిపిచింది.
రాజ్‌నాథ్ సింగ్ గంగోలీ ఘాట్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కొందరిని కలిసి మాట్లాడారు. ఆ సమయంలో ఉత్తరాఖండ్ కు సంబంధించిన చాలా విషయాలను ప్రస్తావించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని ఆదర్శంగా.. అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘దేశంలో ఇప్పుడు పుష్ప అనే పేరు బాగా వినిపిస్తోంది. మా సీఎం పేరు కూడా పుష్కర్. ఆ పేరు వినగానే కాంగ్రెస్ వాళ్లు పువ్వు అనుకుంటున్నారు. మా పుష్కర్ పువ్వు(కమలం పార్టీ వ్యక్తి అని) కూడా అలాగే నిప్పు కూడా’ అంటూ రాజ్ నాథ్ వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో పుష్ప మేనియా ఏ రేంజ్ లో ఉందనేది మరోసారి రుజువైంది.
आज कल फिल्म पुष्पा का नाम काफी चर्चा में है और हमारे CM का नाम पुष्कर है, लेकिन यह पुष्कर नाम सुनकर कांग्रेस के लोग समझते हैं कि ये पुष्कर तो फ्लॉवर है लेकिन मैं उन्हें बताना चाहता हूं कि अपना पुष्कर फ्लॉवर भी है और फायर भी। हमारा पुष्कर ना कभी झुकेगा, ना कभी रूकेगा: रक्षा मंत्री pic.twitter.com/uKEZLT8hRp
— ANI_HindiNews (@AHindinews) February 8, 2022