బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం..తుపాను గా మారి వాయువేగంతో తీరం వైపు దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాలోని ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిలు జారీచేసింది. దక్షిణ అండమాన్ సముద్రం తీరంలో ఏర్పడిన అల్పపీడనం శనివారంకి మరింత బలపడింది. ఇది ఆగ్నేయ బంగాళా ఖాతంలో, దక్షిణ అండమాన్ సముద్రంపై ప్రస్తుతం కొనసాగుతున్నా.. ఆదివారం నాటికి తుపాను మారే అవకాశం ఉందని వాతారవరణ శాఖ తెలిపింది. ఇది రానున్న 6 గంటల్లో వాయుగుండంగా మారుతుందని, 24 గంటల తరువాత తుపాను గా పరిణామం చెందుతుందని భారత వాతావరణశాఖ తెలిపింది.
ఈ తుపాన్ ఈ నెల10 నాటికి ఆంధ్రప్రదేశ్ మీదు ఒడిశా తీరం తాకే అవకాశం ఉందని పేర్కొంది. ఈ తుపాన్ ప్రభావంతో ఏపీ, పశ్చిమ బెంగాల్ ,తెలంగాణ ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. అయితే దీని గమనం గురించి ఇప్పుడే పూర్తిగాఅంచనా వేయలేమని కానీ.. అప్రమత్తంగాఉండాలంటూ ఐఎండీ సూచనలుచేసింది.
తుపాన్ కి ‘అసని’ అని నామకరణం:
బంగాళఖాతంలో ఏర్పడే తుపాన్ లకు ఆచుట్టు ఉండే దేశాలు వంతుల వారీగా తుపాన్లకు నామకరణం చేస్తాయి. ఈసారి రాబోయే తుపాన్ కు పేరు పెట్టే అవకాశం శ్రీలంకాకు వచ్చింది. రాబోయే తుపాను కు ఆసాని అనే పేరును శ్రీలంక ఖరారు చేసినట్లు అధికారులు వెల్లడించారు. సింహళ భాషలో ఆసాని అంటే కోపం, ఆగ్రహం అని అర్ధం అంటా. మరి.. ఈవాతావరణశాఖ తెలిపిన ఈ సమాచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.