కాదేది మోసానికి అనర్హం అన్నట్లుగా సైబర్ దొంగళ్లు రెచ్చిపోతున్నారు. మనిషి ఆశను ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచుకుంటున్నారు. భారీ డిస్కాంట్‌లు, ఖరీదైన బహుమతుల పేరుతో వలవేసి అమాయకులను నిండా ముంచుతున్నారు.
నేటికాలంలో అడ్డదారులో డబ్బులు సంపాదించే వారి సంఖ్య బాగా పెరిగి పోయింది. కాదేది మోసానికి అనర్హం అన్నట్లు సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. మనిషిలో కలిగే ఆశ అనే బలహీనతను ఆసరాగా చేసుకుని అందిన కాడికి దొచుకుంటున్నారు. భారీ డిస్కౌంట్లు, ఖరీదైన బహుమతులంటూ అమాయకులకు వలవేసి నిండా ముంచుతున్నారు. రోజుకో తరహాలో సైబర్ నేర దొంగలు మోసాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ నగరంలో వారం రోజుల్లోనే కోటి రూపాయలను సైబర్ కేటుగాళ్లు కొట్టేశారు.
మీకు బహుమతులు వచ్చాయంటూ, వస్తువులపై భారీ డిస్కౌంట్ ఉందంటూ సైబర్ దొంగలు మెసేజ్ లు పంపిస్తుంటారు. వారు పంపిన ఆ లింక్ పై పొరపాటను క్లిక్ చేస్తే ఇక అంతే సంగతులు. ఇలా లింక్ పంపి.. అమాయాకులన నుంచి వేలల్లో , లక్షల్లో నగదు సైబర్ దొంగలు కొట్టేస్తున్నారు. బాధితులు తాము మోసపోయామని తెలిసే లోపే అంతా జరిగిపోతుంది. రోజుకో తరహాలో సైబర్ నేరగాళ్లు చోరీలకు పాల్పడుతున్నారు. దీంతో ఎటు నుంచి ఏ రూపంలో వచ్చి తమ సొమ్మును కాజేస్తారో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఆన్ లైన్ వ్యాపారం పేరుతో వచ్చే ప్రమోషన్ల ప్రకటనలు, ఇతర ఫోన్ కాల్స్ నమ్మి చాలా మంది జనం లక్షల్లో డబ్బులను సైబర్ కేటుగాళ్లకు సమర్పించుకుంటున్నారు. ఇలా కేవలంలో వారం రోజుల్లోనే ఏకంగా కోటి రూపాయలు సైబర్ దొంగలు కాజేశారని హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు వెళ్లించారు. ఈ మేరకు బాధితుల నుంచి ఫిర్యాదులు అందినట్లు పోలీసు తెలిపారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. అపరిచిత ఫోన్ నెంబర్ల నుంచి వచ్చే కాల్స్, సందేశాలను, ప్రకటనలు నమ్మెుద్దని ప్రజలకు సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా టెలిగ్రామ్ యాప్ వినియోదారులు అప్రమత్తంగా ఉంటాలని పోలీసులు చెబుతున్నారు.
ఇటీవల కాలంలో ఆన్‌లైన్ వ్యాపారం పేరుతో టెలిగ్రామ్ వినియోగదారులనే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు లింక్స్ పంపి మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. అలా వచ్చిన లింక్స్ ను ఓపెన్ చేసిన చాలా మంది లక్షల్లో డబ్బు పోగొట్టుకున్నారని తెలిపారు. ఇలాంటి లింక్స్, మెసేజ్ ల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసు సూచించారు. సైబర్ దొంగలు ట్రాప్ చేయటానికి ప్రయత్నిస్తే వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని పోలీసులు చెబుతున్నారు. మరి.. ఈ ఆల్ లైన్ మోసాల నివారణకు మీ సూచనలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.