మీరు ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా..? అయితే ఈ వార్త మీకోసమే. ఫుడ్ డెలివరీ యాప్ లు ఇస్తున్న ఆఫర్లకు మనం బాగా ఆకర్షితులమై.. అన్నిపూటలా ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసి పబ్బం గడిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మనం అసలు రేటు కంటే ఎక్కువ పెట్టి ఫుడ్ కొంటున్నామట. ఇదే విషయాన్ని ఒక కస్టమర్ ప్రూఫ్స్‌తో సహా బయటపెట్టాడు.
ముంబైకి చెందిన రాహుల్ కబ్రా అనే ఓ వ్యక్తి ఫుడ్ డెలివరీ యాప్ లతో తనకు జరిగిన మోసం గురించి సోషల్‌మీడియా వేదికగా వివరించాడు. రెస్టారెంట్‌కి వెళ్లి ఫుడ్ ఆర్డర్ చేసిన దానికంటే ఆన్‌లైన్‌లో బుక్ చేస్తే ఎంత ఎక్కువ చెల్లించాల్సి వస్తుందో క్లియర్‌గా పేర్కొన్నాడు. అతను లింక్‌డ్ ఇన్‌లో చేసిన పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఇది కూడా చదవండి: పెన్ను పోయిందని పోలీస్ స్టేషన్ లో ఎంపీ ఫిర్యాదు.. దాని ఖరీదు ఎంతంటే?
రాహుల్ కబ్రా సోషల్ మీడియాలో పంచుకున్న వివరాల ప్రకారం.. అతడు ది మోమో ఫ్యాక్టరీ అనే రెస్టారెంట్ నుంచి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. వెజ్ బ్లాక్ పెప్పర్ సాస్, వెజిటెబుల్ ఫ్రైడ్ రైస్, మష్రూమ్ మోమో కొనుగోలు చేశాడు. ఆ టైమ్‌లో రూ.75 డిస్కౌంట్ కూపన్‌ను కూడా వినియోగించాడు. అప్పుడు అతని మొత్తం బిల్లు రూ.690 అయ్యింది. కానీ అదే రెస్టారెంట్‌లో అదే ఫుడ్ CGST, SGST సహా అన్ని ఛార్జీలు కలుపుకుని రూ.512కే వస్తుందని తర్వాత గుర్తించాడు. అంటే సుమారు 35 శాతం ( 178 రూపాయలు ) అదనంగా జొమాటోకు అదనంగా చెల్లించాల్సి వచ్చింది.
Share https://t.co/68BQvGbq9i
— Govardhan Reddy (@gova3555) July 6, 2022
ఇలా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు మోసానికి పాల్పడుతున్నాయని.. వీటిని ప్రభుత్వాలే నియంత్రించాలని అతను అభిప్రాయపడ్డాడు. ఇదే విషయాన్ని లింక్‌డ్ ఇన్ ద్వారా చెప్పుకొచ్చాడు. రాహుల్ కబ్రా చేసిన ఈ పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ ఇంత మోసం చేస్తున్నాయా అంటూ నెటిజన్లు షాకవుతున్నారు. తమకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందని పలువురు నెటిజన్లు కామెంట్స్ కూడా పెడుతున్నారు.
ఇది కూడా చదవండి: 54 Year Old Woman: వెలుగులోకి మేకప్ ఆంటీ మోసాలు! సుకన్య, శరణ్య, సంధ్య పేర్లతో ..