సాధారణంగా మనం దోమల నుంచి కాపాడుకునేందుకు, అలానే ప్రశాంత నిద్రపోవడానికి మస్కిటో కాయిల్ పెట్టుకుంటాము. అయితే ఈ మస్కిటో కాయిలే మనిషుల ప్రాణాలను తీస్తుందా?. ఈ ప్రశ్నకు సమాధానం అవుననే వినిపిస్తున్నాయి. తాజాగా మస్కిటో కాయిల్ కారణంగా ఆరుగురు మృతి చెందారు
సాధారణంగా మనం దోమల నుంచి కాపాడుకునేందుకు, అలానే ప్రశాంత నిద్రపోవడానికి మస్కిటో కాయిల్ పెట్టుకుంటాము. అయితే ఈ మస్కిటో కాయిలే మనిషుల ప్రాణాలను తీస్తుందా?. ఈ ప్రశ్నకు సమాధానం అవుననే వినిపిస్తున్నాయి. కారణంగా మస్కిటో కాయిల్ కారణంగా ఆరుగురు మృతి చెందారంట. అది కూడా ఎక్కడో పరాయి దేశంలో జరిగింది కాదు… మన దేశ రాజధాని ఢిల్లీ నగరంలోనే చోటుచేసుకుంది. మస్కిటో కాయిల్ వల్ల ఆరుగురు ఎలా చనిపోయారు అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఈ ఘటనపై పోలీసు ప్రాథమిక విచారణ జరిపించారు. విచారణ అనంతరం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..
ఢిల్లీ నగరంలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో ఓ ఇంట్లో ఆరుగురు వ్యక్తులు నివాసం ఉంటున్నారు. స్థానికంగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే రోజు ఉదయాన్నే బయటికి వచ్చి.. తమ పనులకు వెళ్తుండే వారు. అయితే శుక్రవారం ఉదయం మాత్రం ఆ ఆరుగురు బయటకి రాలేదు. దీనికి తోడు ఇంటి నుంచి పొగలు వస్తున్నాయి. ఇంటి నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందిచారు. పోలీసులు వచ్చి ఇంటి తలుపులు పగలగొట్టి లోపలి వెళ్లారు. అక్కడకి వెళ్లి చూడగా ఆరుగురు విగత జీవులుగా పడి ఉన్నారు.
వారి ముఖాలపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో పోలీసులకు అర్థం కాలేదు. దీంతో గది మొత్తాన్ని పరిశీలించగా.. మస్కిటో కాయిల్ కారణంగానే వారు చనిపోయినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్థారించారు. గురువారం రాత్రి దోమల కారణంగా ఇంటి తలుపులు, కిటికీలు అన్ని మూసివేసి.. వాళ్లు మస్కిటో కాయిల్స్ వెలిగించారు. దీంతో గదిలోని గాలి మొత్తం కార్బన్ యాక్సిడ్ గా మారిపోయింది. దీంతో ఊపిరాడక.. నిద్రలోనే వారు మరణించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇంట్లోకి దోమలు రాకుండా అన్ని తలుపులు, కిటికీలు మూసివేసి.. మస్కిటో కాయిల్స్ వెలిగించటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ చెబుతున్నారు.
అయితే మృతి చెందిన వారి పూర్తి వివరాల కోసం దర్యాప్తు కొనసాదుతుందని పోలీసులు స్పష్టం చేశారు. అంతేకాక ఆ ఆరుగురి మరణం వెనక ఎలాంటి కుట్రలు లేవని.. హత్యలు కాదని వెల్లడించారు. దర్యాప్తు పూర్తైన తరువాత మరిన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు అన్నారు. అయితే పోలీసులు తెలిపిన ఈ మస్కిటో కాయిల్స్ విషయంలో జనాలకు అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మస్కిటో కాయిల్ మనుషుల ప్రాణాలు తీస్తాయా? అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి..ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.