జనవరి 1వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో ఓ యువతిని దాదాపు 20 కి.మీ ఈడ్చుకెళ్లిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి విదితమే. ఆ ఘటనలో యువతి మృతి చెందింది. తాజాగా అటువంటి ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది.
దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. వాహనదారులు అత్యంత నిర్లక్యంతో వాహనాలను నడుపుతున్నారు. తప్పతాగి వాహనం నడపడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం, అజాగత్త్ర వంటివి రోడ్డు ప్రమాదాలకు కారణాలవుతున్నాయి. కొన్ని సార్లు ప్రమాదానికి వారే కారణమైనా.. బాధితుల్ని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాల్సిందీ పోయి.. తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో ఓ యువతిని దాదాపు 20 కి.మీ ఈడ్చుకెళ్లిన ఘటన ఇటువంటిదే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి విదితమే. తాజాగా అటువంటి ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది.
యుపిలోని మహేబా పట్టణానికి చెందిన రిటైర్డ్ స్కూల్ టీచర్ ఉదిత్ నారాయణ్ చాన్ సోరియా, తన ఆరేళ్ల మనవడు సాత్విక్‌ని స్కూటీపై ఎక్కించుకుని మార్కెట్‌కు బయలుదేరాడు. మార్గం మధ్యలో వీరు ప్రయాణిస్తున్న స్కూటీని వేగంగా వస్తున్న ఓ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ఉదిత్ అక్కడిక్కడే మృతి చెందాడు. స్కూటీతో సహా సాత్విక్ ను దాదాపు 2 కిలోమీటర్ల దూరం ట్రక్కు ఈడ్చు కెళ్లింది. ఈ ఘటనలో బాలుడు మృతి చెందాడు. కాన్పూర్-సాగర్ హైవే ఎన్ హెచ్ 86పై జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్కూటీని ఈడుకెళుతున్న డ్రైవర్‌ను అప్రమత్తం చేసేందుకు ఆ దారిలో వెళుతున్న పలువురు వాహనదారులు చెబుతున్నప్పటికీ వినిపించుకోలేదు.
వాహనదారులు చెబుతున్నా వినిపించుకోకుండా, తప్పించుకునేందుకు వేగంగా బండిని నడిపాడు. సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు వాహనాన్ని ఈడ్చుకుంటూనే వెళ్లాడు. ఎదురు భాగంలోనే స్కూటీని లాక్కెళ్లాడు. ఆపకపోవడంతో స్థానికులు బండరాళ్లు, ఇటుకలను రోడ్డుకు అడ్డంగా పెట్టి నిలిపేశారు. అప్పటికే రెండేళ్ల చిన్నారి చనిపోయాడు. డ్రైవర్ ను పట్టుకుని స్థానికులు చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు లారీని అదుపులోకి తీసుకుని, డ్రైవర్ ను అరెస్టు చేశారు. నిందితుడిపై పలు కేసుుల బనాయించారు. ఈ దారుణ ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ਯੂਪੀ ਦੇ ਮਹੋਬਾ ਤੋਂ ਸਾਹਮਣੇ ਆਇਆ ਦਿਲ ਨੂੰ ਦਹਿਲਾ ਦੇਣ ਵਾਲਾ ਮਾਮਲਾ; ਪੂਰੇ ਦੋ ਕਿਲੋਮੀਟਰ ਤੱਕ ਇੱਕ ਡੰਪਰ ਹੇਠਾਂ ਫਸੀ ਰਹੀ ਸਕੂਟੀ; ਹਾਦਸੇ ‘ਚ ਸਕੂਟੀ ‘ਚ ਫਸਿਆ ਰਿਹਾ 2 ਸਾਲਾ ਮਾਸੂਮ#Scooty #stuck #dumper #Mahoba #UP #accident #ViralVideo pic.twitter.com/dogZyKVq7E
— ਪੀਟੀਸੀ ਨਿਊਜ਼ | PTC News (@ptcnews) February 26, 2023