భర్తను ఏ విషయంలోనైనా సహించే ఆడది.. పరాయి స్త్రీ వ్యామోహంలో పడ్డాడంటే భరించలేదు. తన భర్త మరో ఆమెతో సరసల్లాపాల్లో మునిగి తేలుతున్నాడని తెలిస్తే భర్తను నిలదీస్తుంది. భార్యా భర్తల మధ్య మనస్పర్థలు మొదలవుతాయి. అవి ఎంతటి తీవ్ర స్థాయికైనా చేరవచ్చు.
ప్రేమ, మోహం, డబ్బు చుట్టూనే దారుణాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాల కారణంగా ఇటీవల కాలంలో అనేక హత్యలు జరిగాయి. జీవిత భాగస్వామిని కాదని పక్కతోవ పడుతున్నారు కొందరు. ఏదో ఒక సమయంలో ఈ అక్రమ సంబంధం బయట పడి.. ఇంట్లో రచ్చగా మారుతుంది. భర్తను ఏ విషయంలోనైనా సహించే ఆడది.. పరాయి స్త్రీ వ్యామోహంలో పడ్డాడంటే భరించలేదు. తన భర్త మరో ఆమెతో సరసల్లాపాల్లో మునిగి తేలుతున్నాడని తెలిస్తే భర్తను నిలదీస్తుంది. ఈ విషయంలో భార్యా భర్తల మధ్య మనస్పర్థలు మొదలవుతాయి. అవి ఎంతటి తీవ్ర స్థాయికైనా చేరవచ్చు. ఇటువంటి ఘటనే తమిళనాడులో చోటుచేసుకుంది. అయితే ఇందులో మూడో వ్యక్తి బలైంది.
డిగ్రీ చదువుతున్న అమ్మాయితో భర్త వివాహేతర సంబంధాన్ని తట్టుకోలేని భార్య.. ఆ యువతిని పొడిచి చంపిన ఘటన తమిళనాడులో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కోయంబత్తూరులోని ఎడయార్ పాళయంకు చెందిన సుజయ్ (30), డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న అద్వానీ నగర్‌కు చెందిన ఆర్ సుబ్బలక్ష్మి (20)కి మూడేళ్లకు పైగా పరిచయం ఉంది. వారిద్దరూ గతంలో ప్రేమించుకన్నారు. కాగా, ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నసుజయ్‌కు కేరళకు చెందిన రేష్మ(25) అనే యువతితో వివాహం జరిగింది. పొల్లాచ్చి సమీపంలోని మహాలింగపురం గౌరీనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో దంపతులు నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం రేష్మ గర్భవతి.
పెళ్లైన తర్వాత కూడా సుజయ్ .. రేష్మతో తన సంబంధాన్ని కొనసాగించాడు. అతడికి పెళ్లైన విషయం తెలియని సుబ్బలక్ష్మి అతడితో తన సంబంధాన్ని కొనసాగించింది. వీరిద్దరి విషయం భార్య రేష్మకు తెలిసి మండిపడింది. ఇటు సుబ్బలక్ష్మికి విషయం తెలిసి భార్యాభర్తలను తిట్టిపోసింది. అయితే ఈ విషయంపై ఆమెతో మాట్లాడాలని పిలిపించింది రేష్మ. మంగళవారం సాయంత్రం సుజయ్ ఇంటికి వెళ్లింది సుబ్బలక్ష్మి. అనంతరం ఆమెపై కత్తితో దాడి చేసింది రేష్మ. ఆమె పొడవడంతో అక్కడే చనిపోయింది. అనంతరం భార్యా భర్తలు ఇద్దరు పారిపోయారు. యువతి అరుపులు విన్న స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. సుజయ్ ప్లాట్ లో నుండే అరుపులు వచ్చాయని చెప్పడంతో పోలీసులు వెళ్లి చూడగా..రక్తపు మరకల్లో పడి ఉంది సుబ్బలక్ష్మి. నిందితులను గాలించగా.. కన్నూరు సమీపంలో దంపతులను అరెస్టు చేశారు.