భార్యా భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సహజం. అయితే ఈ గిల్లికజ్జాలు హద్దు మీరనంత వరకే. పడుతుందీ కదా అని భార్యను ఇష్టమొచ్చినట్లుగా తిట్టడం, కొట్టడం, వేధించడం చేస్తే సహించలేదు. భర్త వేధింపుల్ని ఏ భార్య కూడా భరించలేదు. చివరకు ప్రాణం తీయడమో, తీసుకోవడమో చేస్తోంది. తాజాగా తమిళనాడులో ఓ మహిళ ఏం చేసిందంటే
భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సహజం. అవి ఉంటేనే సంసారం సాఫీగా సాగిపోతుంది. వీరి మధ్య గొడవలు చిలికి చిలికి గాలి వానగా మారితే రెండు జీవితాలు కాదూ.. రెండు కుటుంబాలు నాశనం అవుతాయి. అయితే ఈ గిల్లికజ్జాలు హద్దు మీరనంత వరకే. పడుతుందీ కదా అని భార్యను ఇష్టమొచ్చినట్లుగా తిట్టడం, కొట్టడం, వేధించడం చేస్తే సహించలేదు. అలాగే భర్త విషయంలోనూ భార్యకు వర్తిస్తుంది. అందరి ముందు హేళన, అరవడం వంటివి చేస్తే భర్త కూడా భరించలేరు. అయితే ప్రస్తుత పురుషాధిక్య సమాజంలో భర్తల చేతిలో భార్యలు వేధింపులకు గురౌతున్నారు. మాట వినడం లేదంటూ చేయి చేసుకోవడం, కాలితో తన్నడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఆమె భరించేంత వరకే. ఇటువంటి బాధలను తట్టుకోలేని ఓ భార్య క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం.. అతడి చావుకు కారణమైంది.
తమిళనాడులోని సేలం జిల్లా భారతీపురానికి చెందిన సెల్వ రాజ్, డయానా మేరీకి కొన్నేళ్ల క్రితం పెళ్లి అయింది. అయితే వీరికి పిల్లలు లేరు. సెల్వరాజ్ ఆటో నడుపుతూ ఉండేవాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. తాగొచ్చి తరచూ భార్యతో గొడవపడేవాడు. భార్య ఎంత నచ్చజెప్పినా, పెద్దలు బుద్ధి చెప్పినా తన తీరు మార్చుకోలేదు. దీంతో ఆమె మూడు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. పలుమార్లు కాపురానికి పిలిచినా ఆమె రాలేదు. అల్లుడిలో కూడా మార్పు రాకపోవడంతో ఆమెను సెల్వరాజ్ వద్దకు పంపలేదు. అయితే ఈ నెల 5న భార్య కోసం అత్తింటికి వెళ్లాడు. తనతో్ రావాలని కోరాడు. అయితే ఆమె అంగీకరించలేదు. నీ పద్ధతి మార్చుకుంటేనే వస్తానని తెగేసి చెప్పింది. తనతో రావడానికి అంగీకరించలేదని భార్య మేరీతో గొడవకు దిగాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత మేరీపై చేయి చేసుకున్నాడు.
పుట్టింటికి వచ్చి కొట్టడంతో మేరీ భర్తపై కో్పంతో ఊగిపోయింది. అప్పుడే పోయి మీద కాగుతున్న నీళ్లలో కారం కలిపి భర్త సెల్వరాజ్ పై పోసింది. మరుగుతున్న నీళ్లు, కారం మంటలు భరించలేక గట్టిగా కేకలు వేశాడు. దీంతో ఇరుగు పొరుగు అతడ్ని హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. అయినా సెల్వరాజ్ కోలుకోలేదు. పది రోజులకు పైగా చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు. ఆసుపత్రిలో చేరేటప్పుడే అతడు వాంగూల్మమిచ్చాడు. భార్య, అత్త కలిసి తనపై కారం కలిపిన వేడి నీళ్లు పోసి హత్యాయత్నం చేశారని చెప్పారు. దీంతో మేరీ, ఆమె తల్లిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే సెల్వరాజ్ భార్య, అత్తలను హింసించేవాడని స్థానికులు చెప్పడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు. ఆవేశంలో భర్త పట్ల భార్య తీసుకున్న ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.