ప్రపంచం డబ్బు చుట్టూ తిరుగుతోంది. డబ్బు, ఆస్తి, అంతస్థులు కోసం ఎన్ని అఘాయిత్యాలు జరిగాయో చెప్పనక్కర్లేదు. తల్లిదండ్రులను, సోదరులను, కట్టుకున్న భార్యను లేదా భర్తను కడతేర్చిన వారున్నారు. డబ్బే పరమావధిగా జీవిస్తున్నారు.
ప్రపంచం డబ్బు చుట్టూ తిరుగుతోంది. డబ్బు, ఆస్తి, అంతస్థులు కోసం ఎన్ని అఘాయిత్యాలు జరిగాయో చెప్పనక్కర్లేదు. తల్లిదండ్రులను, సోదరులను, కట్టుకున్న భార్యను లేదా భర్తను కడతేర్చిన వారున్నారు. డబ్బే పరమావధిగా జీవిస్తున్నారు. దీని కోసం ఏ సంబంధాలను పట్టించుకోవడం లేదు. నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చేస్తున్నారు. తమ స్వార్థ కోసం ఎంతటి దారుణానికైనా వెనుకాడం లేదు. తాము చేస్తుంది తప్పని తెలిసినా కూడా పాశ్చాతాప్త పడటం లేదు. జైలుకెళ్లేందుకైనా సిద్ధమవుతున్నారు. అటువంటి ఘటనే ఇది. చనిపోయిన భర్త ఉద్యోగం కోసం ఇద్దరు భార్యలు గొడవ పడ్డారు. చివరకు ఆ ఉద్యోగం కోసం ఒకరు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది.
రాజస్థాన్ లో కొద్ది రోజుల క్రితం సుధా చౌదరి అనే మహిళ.. తన కుమారుడితో కలిసి స్కూటీపై వెళుతుండగా.. దుండగులు వెంబడించి ఆమెను కాల్చి చంపారు. అయితే ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె సమీప బంధువే సుధా చౌదరిని హత్య చేసినట్లు తేల్చారు. నిందితుడు మనోజ్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారించగా అసలు విషయం బయటకొచ్చింది. వివరాల్లోకి వెళితే.. సుధా చౌదరి భర్త పుష్పేంద్ర సింగ్ సీఆర్ఫీఎఫ్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే అతడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుశీలా దేవీ అనే యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన మొదటి భార్య.. తన పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే 2022లో పుష్పేంద్ర సింగ్ మరణించాడు.
మరణానంతరం వచ్చే భర్త ఉద్యోగం కోసం ఇద్దరు భార్యలు వివాదానికి దిగారు. కారుణ్య నియామకం తనకు వర్తిస్తుందని ఇద్దరూ కొట్టుకోవడం మొదలు పెట్టారు. అతడు తన భర్త అంటే తన భర్త అని పోట్లాడుకున్నారు. ఈ సమయంలో మనోజ్ సింగ్.. పుష్పేంద్ర రెండో భార్యకు మద్దతు ఇవ్వడం మొదలు పెట్టాడు. సుధా చౌదరిని అంతమొందించేందుకు ప్రణాళిక రచించాడు. గత నెలలో భరత్‌పూర్ జిల్లాలోని నాద్‌బాయి పట్టణంలో స్కూటీపై వెళ్తున్న సుధాను పట్టపగలు బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు వెనుక నుంచి కాల్చి చంపారు. అనంతరం అక్కడ నుండి పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణలో ఈ విషయాలు బహిర్గతం అయ్యాయి. నిందితుడు మనోజ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.