వాళ్ల ఫ్లాట్‌లో పని చేసేందుకు వచ్చిన పని మనిషి కాలింగ్ బెల్ నొక్కింది. ఎంతకూ భార్య భర్తలు తలుపుతీయలేదు. కాగా, ఊ అనో లేదా వస్తునా ఉండో అనే పిలుపు కూడా వినలేదు. ఎంత సేపటికి తలుపు తీయకపోయే సరికి ఆమె బంధువులకు ఫోన్ చేసింది. తీరా తలుపు తీసి చూస్తే
ఇటీవల అనేక మరణాల వెనుక కారణాలు ఉండటం లేదు. ఇలా చూస్తున్న వారూ అలా కనిపించకుండా పోతున్నారు. రాత్రి చూసిన వారూ పగలు విగత జీవులై కనిపిస్తున్నారు. దీంతో కేసులు విచారణ చేపట్టలేక పోలీసులు కూడా సతమతమౌతున్నారు. తాజాగా అటువంటి ఘటన ముంబయిలో చోటుచేసుకుంది. బుధవారం ఉదయం వాళ్ల ఫ్లాట్‌లో పని చేసేందుకు వచ్చిన పని మనిషి కాలింగ్ బెల్ నొక్కింది. ఎంతకూ భార్య భర్తలు తలుపుతీయలేదు. కాగా, ఊ అనో లేదా వస్తునా ఉండో అనే పిలుపు కూడా వినలేదు. ఎంత సేపటికి తలుపు తీయకపోయే సరికి ఆ ఇంటి యజమాని బంధువులకు ఫోన్ చేసింది. వచ్చి చూడగా వారిద్దరూ మృతదేహాలు లభించాయి బాత్రూమ్‌లో.
ముంబయిలో జరిగిన ఈ జంట మృతి ఘటన స్థానికంగా కలకలం రేగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కోపర్ ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో దీపక్ షా (42), రినా షా (39) అనే దంపతులు ఉంటున్నారు. బుధవారం వాళ్ల ఇంటికి పని మనిషి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టగా.. ఎంతకూ వీరూ తీయలేదు. చివరకు సమీపంలో ఉంటున్న దీపక్ అమ్మకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో ఆమె మరికొందరితో కలిసి తన వద్దనున్న మరో కీతో తలుపుతీసి చూడగా.. బాత్రూమ్ లో షవర్ శబ్ధం వినిపించింది. దీంతో బాత్‌రూమ్ తలుపు తెరిచి చూడగా ఇద్దరూ దుస్తులు లేకుండా అనుమానాస్పద రీతిలో కిందపడిపోయి ఉన్నారు. తక్షణమే వారిని ఆసుప్రతికి తరలించారు.
వారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఇద్దరూ మరణించారని తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని, ఇద్దరి మృతదేహాల్ని స్వాధీనం చేసుకుని అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను తరలించారు. అయితే, బాత్‌రూమ్‌లోని గీజర్ షాక్ కొట్టడం వల్లే ఆ దంపతులు మరణించి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ఇంటి దగ్గర పోలీసులు తనిఖీ చేసినప్పటికీ, ఎలాంటి అనుమానాస్పదంగా అనిపించలేదని పోలీసులు తెలిపారు. కాగా, పోస్టుమార్టమ్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే వారి మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.