భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య.. మరొకరితో వివాహేతర సంబంధాన్ని నెరుపుతున్నారు. పెళ్లి నాటి ప్రమాణాలను కాలరాస్తూ, నైతిక విలువలను దెబ్బతీస్తూ అక్రమ సంబంధాలను కొనసాగిస్తున్నారు. జీవిత భాగస్వామికి తెలియకుండా పాడు పనులు చేస్తున్నారు.
పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారం ఉండటం సర్వసాధారణం. కానీ కొంత మంది పెళ్లి అయ్యాక ప్రేమ వ్యవహారాన్ని నడుపుతున్నారు. భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య.. మరొకరితో వివాహేతర సంబంధాన్ని నెరుపుతున్నారు. పెళ్లి నాటి ప్రమాణాలను కాలరాస్తూ, నైతిక విలువలను దెబ్బతీస్తూ అక్రమ సంబంధాలను కొనసాగిస్తున్నారు. జీవిత భాగస్వామికి తెలియకుండా పాడు పనులు చేస్తున్నారు. చివరకు తెలిసి నిలదీసే సరికి గొడవలు, ఘర్షణలు, తగాదాలు మొదలయ్యి తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. అయితే ఇదే సమయంలో పరాయి వ్యక్తుల సాంగత్యం కోసం తమకు అడ్డుగా ఉన్న జీవిత భాగస్వామిని అంతమొందించేందుకు వెనుకాడటం లేదు.
గత నెల 28న కర్ణాటకలోని తలఘట్టపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ హత్య చోటుచేసుకుంది. ఓ వ్యక్తిపై ఆయుధాలతో దాడి చేసి చంపిన దుండగులు అనంతరం అక్కడి నుండి పరారయ్యారు. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు.. గుర్తు తెలియని మృతదేహాన్నిఅరుణ్(43) గా గుర్తించారు. మృతదేహాన్ని భార్యకు అప్పగించగా.. ‘ఏవండీ’అంటూ తీవ్రంగా రోదించింది. తొలుత ఆర్థిక లావాదేవీలపై ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావించారు. అయితే ఈ కేసు విచారిస్తుండగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్యకు ఆయన భార్యే స్కెచ్ వేసిందని తెలిసి ఆశ్చర్యపోయారు. వివరాల్లోకి వెళితే..చన్నపట్నానికి చెందిన మృతుడు అరుణ్‌కు ఆరేళ్ల క్రితం రంజితతో వివాహమైంది. ఆర్ఆర్ నగర్‌లో ఓ హోటల్ నడుపుతున్నాడు.
ఆ హోటల్‌కు నీరు సప్తై చేసేవాడు ఆసామి గణేష్ అనే వ్యక్తి. అరుణ్ .. ఇతడి వద్ద అప్పు కూడా తీసుకున్నాడు. ఈ సమయంలో భార్య రంజితకు, గణేష్‌కు మధ్య ప్రేమ ఏర్పడింది. ఈ విషయం రంజిత భర్త అరుణ్‌కు తెలిసి.. మందలించాడు. దీంతో అతడి అడ్డు తొలగించుకోవాలని ఇద్దరూ భావించి..పథకం వేశారు. హత్యకు ముందు రోజు రంజిత తన స్వగ్రామం మాండ్యకు వెళ్లింది. ఆ సమయంలో ‘పార్టీ చేసుకుందాం’రా అని గణేష్.. అరుణ్‌ను పిలిచి గ్యాంగ్ సిద్ధం చేశాడు. చెప్పిన ప్రాంతానికి అరుణ్ వెళ్లగానే.. వెంట తెచ్చిన ఉప్పు,కారం కళ్లల్లో కొట్టాడు. అనంతరం 20 సార్లు కత్తితో పొడిచి చంపింది గ్యాంగ్. అనంతరం అక్కడ నుండి పారిపోయారు. అయితే స్థానికులు గణేష్, అరుణ్ మధ్య ఆర్థిక లావాదేవీలున్నట్లు చెప్పడంతో.. ఆ కోణంలో విచారిస్తే ఈ ప్రేమ వ్యవహారం బయటపడింది. ఈ కేసులో గణేష్‌తో పాటు ఐదుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు.