మైనర్లు తల్లిదండ్రుల కళ్లు కప్పి స్మోకింగ్, మద్యం సేవించడం వంటి పనులను చేస్తున్నారు. తల్లిదండ్రులను, టీచర్లను మభ్య పెట్టి పాఠశాలలకు హాజరుకాకుండా సినిమాలు, షికార్లు చేయడంతో పాటు వ్యవసనాలకు బానిసలవుతున్నారు. తాజాగా అకారణంగా ఓ విద్యార్థిని పొట్టనబెట్టుకున్నారు తోటి విద్యార్థులు.
నిండా 15 ఏళ్లు కూడా నిండని చిన్నారులు దారి తప్పుతున్నారు. చదువుకోవాల్సిన వయస్సులో చెడు వ్యవసనాలకు లోనవుతున్నారు. తల్లిదండ్రుల కళ్లు కప్పి స్మోకింగ్, మద్యం సేవించడం వంటి పనులను చేస్తున్నారు. తల్లిదండ్రులను, టీచర్లను మభ్య పెట్టి పాఠశాలలకు హాజరుకాకుండా సినిమాలు, షికార్లు చేయడంతో పాటు వ్యవసనాలకు బానిసలవుతున్నారు. పిల్లలు చేస్తున్న చేష్టలు తెలిసేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. సిగరెట్ తాగుతుండటాన్ని తోటి విద్యార్థి చూడగా.. ఉపాధ్యాయులకు చెబుతాడేమోనని స్నేహితుడు అని కూడా చూడకుండా ఇద్దరు విద్యార్థులు పొట్టనబెట్టుకున్న ఘటన దేశ రాజధాని హస్తినలో చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఇద్దరు తోటి విద్యార్థులు కొట్టి చంపి, కాలువలో పడేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఇద్దరు విద్యార్థులు స్కూల్ ఆవరణలో సిగరెట్ తాగుతూ ఉండగా మోలడ్‌బంద్ గ్రామ బిలాస్‌పుర్ క్యాంపునకు చెందిన సౌరభ్ (12) వీరిని చూశాడు. టీచర్లకు చెబుతానని బెదిరించడంతో.. సౌరభ్‌ను ఓ మారుమూల ప్రాంతానికి లాకెళ్లి తలపై కొట్టి చంపేశారు. అనంతరం కాలువలో పడేశారు. ఆగ్నేయ దిల్లీలోని బదర్‌పుర్ సమీప కాలువలో స్కూలు యూనిఫాంతో ఉన్న బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. స్కూల్ బ్యాగు కూడా కాలువ పక్కనే పడుంది. ఒంటిపై స్కూల్ యూనిఫాం ఆధారంగా విచారణ చేపట్టగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకొన్న పోలీసులు జువెనైల్ జస్టిస్ బోర్డు ఎదుట వారిని హాజరుపరచనున్నట్లు తెలిపారు.