ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఒకరైన బాలీవుడ్ సినీ నటి, మోడల్ గెహనా వశిస్ట్ దాఖలు చేసిన యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్‌ను ముంబై సెషన్స్ కోర్టు కొట్టివేసింది. ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు తిరస్కరించింది. వీడియోల చిత్రీకరణలో, ఫిర్యాదు చేసిన యువతిని బెదిరించటంలో గెహనా పాత్ర కీలకమని పోలీసులు కోర్టుకు తెలియజేశారు. పోర్నోగ్రఫీ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కుంద్రాకు గెహనా వశిష్ట్‌కు మధ్య ఉన్న వ్యాపార సంబంధాలపైనే ప్రస్తుతం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆరా తీస్తున్నారు.
గత ఫిబ్రవరి నెలలో మొదటి సారిగా పోర్నోగ్రఫీ కేసులో ఆమెను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమె బెయిల్‌పై విడుదల అయ్యారు. రెండవసారి రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో ఆమెపై కేసు నమోదైంది. దీంతో పూర్తి వివరాలతో కోర్టు నుంచి కాపీ అందిన తర్వాత తాము ముంబై హై కోర్టును ఆశ్రయిస్తామని గెహనా వశిష్ట్ తరపు అడ్వకేట్ మీడియాకు తెలిపారు. ఈమెపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో నటికి సంబంధించిన మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ ను పోలీసులు సీజ్ చేశారు.
ముంబై పోలీసులు తమ కస్టడీకి ఆదేశించాలని కోరుతూ పిటిషన్ వేయగా విషయం తెలుసుకున్న వందనా తివారి అలియాస్ గెహెనా వశిష్ట్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంది. పోలీసుల విచారణలో రాజ్ కుంద్రా కంపెనీ కోసం అశ్లీల చిత్రాలకు దర్శకత్వం వహించినట్లు కూడా గెహానా పై ఆరోపణలు ఉన్నాయి. ఆమె నటించిన, దర్శకత్వం వహించిన కొన్ని వీడియోలను పోలీసులు అశ్లీల చిత్రాలుగా పరిగణించారు. ఈలోగా, ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో గెహానా రచ్చ చేసింది.