ఈ మద్య కొంత మంది ప్రేమికులు పట్టపగలు నడిరోడ్డుపై బైక్ పై ముద్దులతో రెచ్చిపోతున్నారు. పోలీసులు తగిన గుణపాఠం చెప్పినా ఎక్కడో అక్కడ మళ్లీ మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్ లో నడిరోడ్డుపై బైక్ పై ఓ జంట రెచ్చిపోయారు. చుట్టుపక్కల వాహనదారులు చూస్తున్నారన్న జ్ఞానం కూడా లేకుండా రొమాన్స్ లో మునిగిపోయారు. బైక్ వెనుక నుంచి వస్తున్న మరో వాహనదారుడు ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్ అజ్మీర్ లో ఒక కాలేజ్ క్రాస్ రోడ్డు వద్ద ప్రేమ జంట బైక్ పై రొమాన్స్ చేసుకుంటూ వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. బైక్ పై ఆ జంట పరస్పరం ముద్దుల వర్షం కురిపించుకుంటూ వెళ్లారు. ప్రియుడు బైక్ రైడ్ చేస్తుంటే.. ప్రియురాలు బైక్ పెట్రోల్ ట్యాంక్ పై ఎదురుగా కూర్చొని యువకుడిని పెనవేసుకొని ముద్దుల వర్షం కురిపించింది. ఆ యువకుడు బైక్ ని రోడ్డుపై అలాగే రైడ్ చేస్తు వెళ్లాడు. ఈ ఘటన సోమవారం రాత్రి సమయంలో జరిగింది. దీనికి సంబంధించి దృశ్యాలను బైక్ వెనుక నుంచి వెళ్తున్న ప్రయాణీకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఒక్కసారిగా వైరల్ అయ్యింది.
ప్రేమ జంట బైక్ పై రొమాన్స్ చేస్తూ వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. మోటార్ వెహికిల్స్ చట్టం ప్రకారం ఆ యువకుడిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.. అలాగే బైక్ ని సీజ్ చేశారు. గత నెలలో చత్తీస్ గఢ్, ఉత్తర్ ప్రదేశ్ లో ఇలాంటి సంఘటనలు జరిగాయి.
अजमेर में बाइक पर दिखी अश्लीलता,
आशिकों ने लांगी बेशर्मी की हदें
पुष्कर रोड का बताया जा रहा वीडियो
क्या अजमेर पुलिस भी लेंगी इस मामले में एक्शन ? @AjmerpoliceR #ajmer #अजमेर pic.twitter.com/AKdVEQ6CGS— Amardeep Sharma (@AmarTvMedia) February 7, 2023