ప్రీ వెడ్ షూట్ జరగని పెళ్లిళ్లు ఈ మధ్య కాలంలో తక్కువయిపోయాయి. పెళ్లంటే ప్రీ వెడ్ షూట్ అనేంతలా ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. వింతగా.. కొత్తగా ప్రీ వెడ్ షూట్‌లు చేస్తూ జంటలు రెచ్చిపోతున్నాయి.
ఈ రోజుల్లో పెళ్లికి ముందు ప్రీ -వెడ్డింగ్ షూట్ చేయటం ఫ్యాషన్ అయిపోయింది. ప్రీ వెడ్డింగ్ షూట్ ఎంత కొత్తగా.. ఎంత వింతగా ఉంటే.. అంత పబ్లిసిటీ వస్తుందని జంటలు భావిస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిపోవాలనో.. లేదా ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకంగా మారాలనో కొంతమంది వింత వింత పనులు చేస్తున్నారు. కానీ, ఓ జంట వీటన్నింటికీ భిన్నంగా.. ఎంతో అందంగా ప్రీ వెడ్డింగ్ షూట్‌ను చేసింది. లక్షలు ఖర్చు పెట్టి ఆర్భాటాలకు పోకుండా..
సింపుల్‌గా పల్లెటూళ్లో ప్రీ వెడ్ షూట్‌ను కంప్లీట్ చేసింది. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌ఘడ్‌లోని జాంజ్ గిర్ చంపా జిల్లా పురాణి బస్తీకి చెందిన దేవేంద్రనాథ్ రాథోడ్‌కు రష్మితో త్వరలో వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఈ జంట ప్రీ వెడ్డింగ్ షూట్ చేయాలని భావించింది. అందరిలా కాకుండా వినూత్నంగా.. ఎప్పటికీ గుర్తుండేలా ప్రీ వెడ్ షూట్‌ను చిత్రీకరించాలని భావించింది. చివరకు పల్లెటూరి గెటప్స్‌లో ప్రీ వెడ్ షూట్ ఫైనల్ అయింది. దానికి తగ్గట్లుగా రష్మి చీరకట్టుతో, గ్రామంలోని మహిళలు ధరించే నగలు వేసుకుంది.
దేవేంద్ర పంచెకట్టుతో తలకు పాగా చుట్టుకున్నాడు. ఇద్దరూ పల్లెటూరి వేషధారణలో స్టెప్పులేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ జంట పల్లెటూరి వాతావరణంలో ప్రీ వెడ్ వీడియోను చిత్రీకరించడంపై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రష్మి, దేవేంద్రను మెచ్చుకుంటున్నారు. మరి, అందరి ప్రశంసలు పొందుతున్న ఈ ప్రీ వెడ్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.