నిత్యావసర ధరల మోతతో సతమతమవుతున్న సామాన్యులకు కేంద్రం శుభవార్త చెప్పింది. అత్యవసర మందుల గరిష్ట ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో 651 మందుల ధరలు 6.73శాతం దిగొచ్చాయి.
నిత్యావసర ధరల మోతతో సతమతమవుతున్న సామాన్యుడికి కేంద్రం కాస్త ఊరటనిచ్చే వార్త చెప్పింది. అత్యవసర ఔషధాల జాబితాలో ఉన్న పలు మందుల ధరల గరిష్ట విలువను నిర్ణయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో 651 మందుల ధరలు సగటున 6.73 శాతం వరకు తగ్గాయి. ఈ తగ్గిన ధరలు ఏప్రిల్ నెల నుంచి అమలులోకి వచ్చాయి. ఈ విషయాన్ని మందుల ధరలను నియంత్రించే నేషనల్ ఫార్యాస్యూటికల్స్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.
అత్యవసర ఔషధాల జాతీయ జాబితా (ఎన్ఎల్ఈఎం)లో మొత్తం 870 షెడ్యూల్డ్ మందులు ఉండగా, అందులోని 651 మందులకు గరిష్ట ధర విధించినట్లు ఎన్‌పీపీఏ పేర్కొంది. వాస్తవానికి ద్రవ్యోల్బణం కారణంగా వీటి ధరలు 12.12శాతం పెరగాల్సి ఉంది. అయినప్పటికీ ఎన్‌పీపీఏ తీసుకున్న ఈ నిర్ణయంతో.. వీటి ధరలు 6.73శాతం దిగొచ్చాయి. ఏప్రిల్ 1 నుంచే తగ్గిన ధరలు అందుబాటులోకి వచ్చాయి. జ్వరానికి ఉపయోగించే పారాసెటమాల్, యాంటీ బయోటిక్ ఔషధాలైన అమోక్సిసిలిన్, క్లావులానిక్ యాసిడ్, యాంటీ డయాబెటిస్ ఔషధాలైన మెట్‌ఫార్మిన్, గ్లిమెపిరైడ్, టెల్మిసార్టాన్ వంటి మందులు కాస్త తక్కువ ధరకే దొరకనున్నాయి.
ప్రభుత్వం ప్రకటించిన సీలింగ్ ధరను మించి విక్రయించేందుకు అనుమతులు ఉండవు. కావున నిత్యావసర ధరల మోతతో సతమతమవుతున్న సామాన్యుడికి మందుల ధరల భారం కాస్త తగ్గినట్లే..! కాగా, జాతీయ అత్యవసర ఔషధాల జాబితాలో మొత్తం 870 రకాల మందులు ఉన్నాయి. ఈ మందుల ధరలను జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్‌పీపీఏ) పర్యవేక్షిస్తోంది. అయితే మందుల టోకు ధరల సూచీ ఆధారంగా ఏటా ఏప్రిల్ 1న ఈ ధరలను సవరిస్తుంటారు. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ड्रग्स प्राइस कंट्रोल ऑर्डर (DPCO) 2013 के प्रवाधान अनुसार, हर साल 1 अप्रैल से थोक मूल्य सूचकांक (WPI) से जुड़ी आवश्यक दवाओं के दाम बढ़ाने की अनुमति दी जाती है।
इस संदर्भ में,हम कुछ महत्वपूर्ण जानकारी साझा कर रहे हैं pic.twitter.com/ESiJi0Uehz
— NPPA~India🇮🇳 (@nppa_india) April 3, 2023