గత కొన్ని రోజులుగా భారత్ లో కరోనా కేసులు పెరుగుతూ… తగ్గుతూ వస్తున్నాయి. ఓ వైపు డెల్టా వేరియంట్ నుంచి ప్రపంచదేశాలు బయటపడకముందే ఒమిక్రాన్ రూపంలో కలకలం రేపుతోంది. దేశంలో ఇప్పటికే 23 ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా తాజాగా మరో 9 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా మన దేశంలో కేసులు 32కి పెరిగాయి. ఈ నెల ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ కొత్త వేరియంట్.. ఇప్పటికే ఆ దేశాన్ని గడగడలాడిస్తోంది.
ఇది అత్యంత ప్రమాదకరమైనదిగా గుర్తించిన సంగతి తెలిసిందే. ఇక కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 7,992 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అదే విధంగా నిన్న కరోనా నుంచి 9,265 మంది కోలుకున్నారు. 393 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. దేశంలో ప్రస్తుతం 93,277 మంది కరోనాకు ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 559 రోజుల కనిష్ఠానికి చేరుకుంది.
మొత్తం కేసుల సంఖ్య 3,46,82,736కు చేరింది. ఇందులో 3,41,14,331 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 4,75,128 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు 131.99 కోట్ల మందికి పైగా టీకా వేసినట్లు బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. భారత్ లో ఇప్పటి వరకు 65.46 కోట్ల మందికి కరోనా పరీక్షలు చేసినట్లు వెల్లడించింది ఆరోగ్య శాఖ.
#COVID19 | India reports 7,992 new cases, 9,265 recoveries and 393 deaths in the last 24 hours. Active caseload currently stands at 93,277 – lowest in 559 days: Ministry of Health and Family Welfare
131.99 crore vaccine doses have been administered so far. pic.twitter.com/58j8vLzh1R
— ANI (@ANI) December 11, 2021
#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/fKYq53UxYs pic.twitter.com/FOVNL8YYjn
— Ministry of Health (@MoHFW_INDIA) December 11, 2021