గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా మహమ్మారి కేసులు తగ్గుతూ వస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కాకపోతే ప్రతిరోజూ నమోదవుతున్న కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. డెల్టా వేరియంట్ తర్వాత ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ భయాందోళన సృష్టిస్తుంది. ఇప్పటివరకు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24గా ఉంది. అయితే మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయిన తొలి వ్యక్తి కోలుకున్నాడు. ఆయనకు నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. ఆ వ్యక్తిని బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్టు అధికారులు తెలిపారు.
గడిచిన 24 గంటల్లో 9419 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,66,241కి చేరింది. కాగా, గత 24 గంటల్లో 8251 మంది మహమ్మారి బారినుంచి బయటపడ్డారని, మరో 159 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా నుంచి మొత్తం 3,40,97,388 మంది కోలుకున్నారు. మరణాల సంఖ్య మొత్తం 4,74,111కు చేరింది. 94,742 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 1,30,39,32,286 కరోనా డోసులు పంపిణీ చేశామని కేంద్రం తెలిపింది. మొత్తం కేసుల్లో 0.2 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.36 శాతం ఉందని పేర్కొన్నది.
#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/l7O3FEBCFv pic.twitter.com/tOW14EwtNi
— Ministry of Health (@MoHFW_INDIA) December 9, 2021