భారత్‌లో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. దాదాపు 18 నెలల కనిష్టానికి పడిపోయాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. భయాందోళనకు గురిచేస్తోంది. రోజు రోజుకీ ఒమిక్రాన్ కేసులు పెరుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 23 మందికి ఓమిక్రాన్ సోకింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,822 కేసులు నమోదయ్యాయి. 558 రోజుల తర్వాత కేసుల సంఖ్య ఈ స్థాయిలో తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
గడిచిన 24 గంటల్లో 220 మంది కరోనా వల్ల మృతి చెందారు. ఒక్క కేరళలోనే 168 మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో 95,014 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,48,383 కి చేరగా.. మరణాల సంఖ్య 4,73,757 కి పెరిగినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా నిన్న కరోనా నుంచి 10,004 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3,40,79,612 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
కొత్తగా నమోదైన మరణాల్లో ఎక్కువగా కేరళ, తమిళనాడు, మహారాష్ట్రల్లో నమోదయ్యాయి. ప్రస్తుతం రికవరీ రేటు 98.36 శాతానికిపైగా ఉంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. డైలీ పాజిటివిటీ రేటు 0.63 శాతం ఉంది.
#Unite2FightCorona#LargestVaccineDrive #OmicronVariant
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/urAq6j99aW pic.twitter.com/ksMMiUpJM7
— Ministry of Health (@MoHFW_INDIA) December 7, 2021