భారత్‌లో కరోనా రోజువారి కేసుల సంఖ్య మరోసారి స్పల్పంగా తగ్గింది.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 8,306 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 211 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. దేశంలో ప్రస్తుతం 98,416 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 552 రోజుల్లో ఇంత తక్కువ స్థాయిలో యాక్టివ్ కేసులు ఉండటం ఇదే తొలిసారి అంటున్నారు అధికారులు. దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,46,33,255కి చేరుకుంది.
ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.35 శాతంగా ఉంది. 3,40,60,774 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 1,27,93,09,669 డోసుల వ్యాక్సిన్లు వేశారు. ఇక ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్‌లో విజృంభిస్తుంది. ఆదివారం ఒక్క రోజే 17 ఒమిక్రాన్ వేరియంట్ కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్రలో 7, రాజస్థాన్‌లో 9, ఢిల్లీలో ఒక కేసు నిర్దారణ అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల ఒమిక్రాన్ కేసుల సంఖ్య 21కి చేరింది. మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటకలో, గుజరాత్, ఢిల్లీలో ఒమిక్రాన్ కేసులు నమోదవడంతో ఇతర రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.
Rightwards arrow India’s Cumulative #COVID19 Vaccination Coverage exceeds 127.93 Cr (1,27,93,09,669).
Rightwards arrow More than 24 Lakh doses administered in last 24 hours.#Unite2FightCorona#LargestVaccineDrive pic.twitter.com/QL2LKvCaPf
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) December 6, 2021
#IndiaFightsCorona
Rightwards arrow India’s Active Caseload (98,416) is lowest in 552 days.Rightwards arrow Constitutes 0.28% of Total Cases. #Unite2FightCorona pic.twitter.com/0m1oUMpRQQ
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) December 6, 2021