దేశంలో కరోనా సెకండ్ వేవ్ తర్వాత కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పదివేలకు తక్కువగానే కేసులు నమోదు అవుతున్నాయి. కాకపోతే రుగుతున్న మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఇప్పుడు కరోనా కొత్త రూపం ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. దేశంలో గడిచిన 24 కొత్తగా 5,326 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.
గడిచిన 24 గంటలలో కరోనా నుంచి కోలుకొని 8,043 మంది బాధితులు కోలుకున్నట్లు తెలిపింది. అయితే కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికి మరణాల శాతం పెరుగుతుంది. దేశంలో ప్రస్తుతం 79,097 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 453 మంది మృత్యువాడ పడినట్లు అధికారులు తెలిపారు. దేశంలో ఇప్పటివరకు 3,47,52,164 కేసులు నమోదవగా.. 3,41,95,060 మంది కోలుకున్నారు. 4,78,007 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి : చలిలో రాత్రంతా పసిబిడ్డకు కాపలా కాసిన వీధి కుక్క
దేశంలో ఇప్పటివరకు 1,38,34,78,181 డోసుల పంపిణి చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే దేశంలో ఒమిక్రాన్ కేసులు జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మూడు వారాల వ్యవధిలో 173కి చేరాయి. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం కొంత ఆందోళన కలిగిస్తుంది.
#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/vTu6Vo7SsW pic.twitter.com/ziYAPUSgyw
— Ministry of Health (@MoHFW_INDIA) December 21, 2021