దేశంలో మరోసారి కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్త కేసుల సంఖ్య 7 వేలకు దిగువకు చేరింది. కొత్తగా 6,563 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనాతో 132 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది. నిన్న దేశంలో మొత్తం 8,077 మంది కరోనా నుంచి కోలుకున్నారని తెలిపింది. యాక్టివ్ కేసుల సంఖ్య 572 రోజుల కనిష్ఠానికి తగ్గిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. శంలో ప్రస్తుతం 82,267 మంది ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారు. మృతుల సంఖ్య మొత్తం 4,77,554కు చేరింది.
ఇప్పటి వరకు దేశంలో 34,740,275 మందికి కరోనా సోకగా.. అందులో 3,41,78,940 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 98.38 శాతంగా ఉంది. ఇదిలా ఉంటే గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ ఇటీవల దేశంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. దేశంలోని పలు రాష్ట్రాలపై ఒమిక్రాన్ దాని ప్రభావాన్ని చూపుతోంది. ఆదివారం మహారాష్ట్రలో ఆరు, గుజరాత్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 153కు చేరింది.
ఇదీ చదవండి : సన్నీ బిగ్ బాస్ 5 విన్నర్ అవ్వడానికి కారణాలు!
ఇదిలా ఉంటే.. 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో మహారాష్ట్రలో అత్యధికంగా 54, ఢిల్లీలో 22, రాజస్థాన్‌లో 17, కర్ణాటకలో 14, తెలంగాణ 20, గుజరాత్ 11, కేరళ 11, ఆంధ్రప్రదేశ్ 1, చండీగఢ్ 1, తమిళనాడు 1, పశ్చిమబెంగాల్‌లో 1 చొప్పున రికార్డయ్యాయి. ఇక ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కరోనా నిబంధనలు పాటించాలని పేరొన్నది. వీలైంత వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవలని సూచించింది.
#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/ePfVfanKHQ pic.twitter.com/7T81PESsEu
— Ministry of Health (@MoHFW_INDIA) December 20, 2021