శుక్రవారం సాయంత్రం ఒడిశాలో కోరమాండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీ కొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటికి 280 మందికి పైగా చనిపోయినట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రపంచ దేశాల అధినేతలు సైతం స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నారు. అయితే, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఘటనా స్థలానికి చేరుకుని అంతా పరిశీలించారు. ప్రధాని నరేంద్రమోడి సైతం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇదిలా ఉంటే, ఈ ఘటన తర్వాత చాలా మంది కోరమాండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ హిస్టరీ తెలుసుకోవాడనికి గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. అసలు కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రత్యేకతలు:
- ఇది దేశంలో మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్.
- దీనిని 46 ఏళ్ల కిందటే ప్రవేశ పెట్టారు.
- రైల్వే చరిత్రలో అత్యధిక స్పీడ్ తో తీసుకొచ్చిన మొట్టమొదటి రైలు.
- ఈ రైలు ప్రారంభంలో వారానికి రెండు సార్లు మాత్రమే నడిచేది. కానీ, ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు రోజూ నడిపిస్తున్నారు.
- కోరమాండల్ ఎక్స్ ప్రెస్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది.
- ఇది చెన్నై నుంచి పశ్చిమ బెంగాల్ లోని హౌరాకు వెళ్తుంది.
- ఈ సూపర్ ఫాస్ట్ రైలు గంటకు 130 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది.
- చెన్నై నుంచి హౌరా వరకు 25 గంటల్లో 16,61 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
- ఇది చెన్నైలో స్టార్ట్ అయితే నాన్ స్టాప్ గా ఆరు గంటల్లో విజయవాడ చేరుకుని 431 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది.
- సౌత్ ఈస్ట్ ఈస్టర్న్ రైల్వేలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ను రారాజుగా పిలుస్తారు.
- కోరమాండల్ ఎక్స్ ప్రెస్ కు గతంలో చాలా ప్రమదాలు జరిగాయి. కానీ, శుక్రవారం జరిగింది మాత్రం రైల్వే చరిత్రలో అతి పెద్దది.
- ఇప్పటి వరకు కోరమాండల్ లక్షమంది ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చడం విశేషం.
Show comments