ఒరిస్సాలో చోటుచేసుకున్న రైలు ప్రమాదం దేశం మొత్తాన్ని విషాదంలో ముంచేసింది. ఈ ఘటనలో 280కిపైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. 1000కిపైగా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక, ఈ ప్రమాదానికి సంబంధించి కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. నిపుణుల బృందం ఇచ్చిన రిపోర్టులో పలు సంచలన విషయాలు వెలుగు చూశాయి. అసలు ప్రమాదం జరగటానికి అసలు కారణాలు బయటపడ్డాయి. నిపుణల బృందం ఇచ్చిన ప్రాథమిక నివేదిక ప్రకారం.. గార్డ్ బ్రేక్ వ్యాన్, హాల్ కోచ్‌లు మెయిన్ లైన్‌పై ఉన్నాయి. కోరమాండల్ రైలుకు మొదట సిగ్నల్ లభించింది. తర్వాత సిగ్నల్ ఆగిపోయింది.
దీంతో కోరమాండల్ రాంగ్ ట్రాక్‌పైకి వచ్చింది. కోరమాండల్‌కు సిగ్నల్ దొరక్కపోవటంతోటే ఈ ప్రమాదం సంభవించింది. కోరమాండల్‌కు చెందిన మొత్తం 21 బోగీలు పట్టాలు తప్పాయి. లూప్ లైన్‌లో ఉన్న గూడ్సు రైలును కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే, ఇంతకు క్రితం అందిన సమాచారం ప్రకారం.. నిన్న సాయంత్రం యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ బెంగళూరునుంచి పశ్చిమ బెంగాల్‌కు వెళుతోంది. 7 గంటల సమయంలో బాలేశ్వర్ దగ్గర యశ్వంత్‌పూర్ పట్టాలు తప్పింది. దీంతో కొన్ని బోగీలు పట్టాలపై పడిపోయాయి.
పడిపోయిన బోగీలను 128 కిలోమీటర్ల వేగంతో వస్తున్న కొరమాండల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఢీకొట్టింది. కొన్ని బోగీలు కిందపడ్డాయి. బోల్తా పడ్డ బోగీలను పక్క ట్రాక్‌పై వెళుతున్న గూడ్సు రైలు ఢీకొట్టింది. కాగా, ఈ ప్రమాదం జరిగిన ప్రదేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. హెలికాఫ్టర్ ద్వారా అక్కడకు చేరుకున్న ఆయన సహాయక చర్యలను సమీక్షించారు. ప్రమాదం జరగటానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మరికొద్దిసేపట్లో క్షతగాత్రులను ఆయన పరామర్శించనున్నారు. మరి, రైలు ప్రమాదంపై నిపుణులు ఇచ్చిన ప్రాథమిక నివేదికపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.