నాటో లో ఉక్రెయిన్ చేరితే తమకు సరిహద్దు పరంగా ప్రమాదం పొంచి ఉందని ఆ దేశంపై రష్యా సైనిక చర్య ప్రారంభించిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆ యుద్ధ ప్రభావం ఇతర దేశాల మీద కూడా పడుతుంది. రష్యా యుద్ధం ప్రభావంతో పెట్రోల్, డిజిల్, బంగారం ధరలు పెరగడంతో పాటు స్టాక్ మార్కెట్ కూడా భారీగా పతనమైన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్, రష్యాల యుద్ధం ఇప్పుడు సామాన్యుడి నిత్యం వాడుకునే వంటనూనె మీద కూడా పడనుంది. రానున్న రోజుల్లో వంట నూనె ధరలు భారీగా పెరగనున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. వంట నూనెల సరఫరాలో అంతరాయం కారణంగా ధరలు భారీగా పెరగనున్నట్లు సరఫరదారులు పేర్కొన్నారు.
తాజాగా వంట నూనెల ధరలు పెంచడం పట్ల సామాన్యూలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని స్టోర్లలో MRPపైన సుమారు 11 రూపాయలు పెంచేశారు. MRP ధర కంటే ఎక్కువ అమ్ముతున్నారని, ఇలా వారి ఇష్టానుసారంగా రేట్లు పెంచుకుంటూ పోతే సామాన్యూడు ఎలా బ్రతికేదని ప్రజలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. రేట్లు పెరిగినప్పుడు పెంచితే మంచిదే కానీ పాత ధర ఉన్న వాటిపైనే అధిక ధర వసూలు చేయడం ఏంటని సామాన్యులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు ముందస్తుగానే వంట నూనెలు కొనుగోలు చేస్తున్నారు. గత రెండు రోజుల కంటే ఇప్పుడు వంట నూనెల ధరలు పెరిగాయి. మరింతగా ధరలు పెరుగుతాయి అనే ఊహాగానాల నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున స్టోర్ల ముందు క్యూలో నిల్చున్నారు. మరి.. ఉన్నట్లుండి వంట నూనెల ధరలు పెంచడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.