ఈ ఏడాది ఐదు నెలల గడవక ముందే సినీ దిగ్గజాలను చలన చిత్ర పరిశ్రమ కోల్పోయింది. అలాగే రాజకీయ ఉద్ధండులుగా పేరొందిన అనేక మంది మరణించారు. మాజీ ఎంపీ, బిజెపి నేత డాక్టర్ కణితి విశ్వనాథం గత నెలలో మరణించిన సంగతి విదితమే. ఈ నెలలోనే బీజెపీ ఎంపీ రతన్ లాల్ కటారియా కన్నుమూశారు. తాజాగా
ఇటీవల వరుసగా రాజకీయ, సినీ రంగ ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఐదు నెలల గడవక ముందే సినీ దిగ్గజాలను చలన చిత్ర పరిశ్రమ కోల్పోయింది. అలాగే రాజకీయ ఉద్ధండులుగా పేరొందిన అనేక మంది మరణించారు. మాజీ ఎంపీ, బిజెపి నేత డాక్టర్ కణితి విశ్వనాథం గత నెలలో మరణించిన సంగతి విదితమే. ఈ నెలలోనే బీజెపీ ఎంపీ రతన్ లాల్ కటారియా కన్నుమూశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జీ సాయన్న అనారోగ్యంతో కన్నుమూశారు. అలాగే మాజీ మంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ గుమ్మడి కుతుహలమ్మ ఫిబ్రవరిలో మరణించారు. తాజాగా మరో రాజకీయ నేత, ఎంపీ తుది శ్వాస విడిచారు.
మహారాష్ట కాంగ్రెస్ నేత, ఎంపీ బాలు దనోర్కర్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 48 సంవత్సరాలు. గత కొంత కాలంలో అనారోగ్యంతో బాధపడుతున్న ధనోర్కర్ ..ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో ఉన్న మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని మహారాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి అతుల్ లోంధే తెలిపారు. బాలు ధనోర్కర్‌గా పేరొందిన ఆయన..చంద్రాపూర్ నుండి పోటీ చేసి గెలుపొందిన ఏకైక కాంగ్రెస్ నేత కావడం విశేషం. ఎంపీ శనివారం కిడ్నీలో రాళ్ల సమస్యలతో మొదట నాగ్ పూర్‌లోని ఆసుపత్రిలో చేరారు. అయిన పరిస్థితి చేయి దాటిందని గ్రహించిన వైద్యులు.. ఆయన్ను ఢిల్లీలోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు.
ఎంపీ తండ్రి కూడా దీర్థకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈ శనివారమే మృతి చెందగా.. ఆదివారం నిర్వహించే అంత్యక్రియలకు హాజరుకాలేదు. శివసేనలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ధనోర్కర్.. 2014లో వరోరా-భద్రావతి నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో కాంగ్రెస్‌లో చేరిన ఆయన ఎంపీగా గెలుపొందారు. ఆయన భార్య ప్రతిభా ధనోర్కర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అంత్యక్రియలను బుధవారం నిర్వహించనున్నారు.