కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో చేదు అనుభవం ఎదురైంది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతుల మీదుగా ఆ పరిస్థితి ఎదురుకావడంతో అందరూ నిశ్చేష్టులయ్యారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. 137వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ఇన్ టెర్మ్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ కాంగ్రెస్ జెండాను ఎగురవేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో జెండాకు కట్టిన తాడును కార్యాలయ సిబ్బంది వేగంగా లాగాడు.
ఇది చదవండి : ఎట్టకేలకు ధాన్యం కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!
సోనియా కూడా అంతే వేగంతో తాడును లాగారు. దీంతో ఎగరాల్సిన జెండా కాస్త ఊడి సోనియా గాంధీ మీద పడిపోయింది. జెండా కింద పడిపోవడంతో అక్కడున్న నేతలంతా షాక్‌కు గురయ్యారు. ఓ మహిళా కార్యకర్త వేగంగా వచ్చి.. జెండాను సర్దే ప్రయత్నం చేశారు. కానీ చివరకు ఆ జెండాను ఎగురవేయకుండానే పక్కకు పెట్టేశారు. ఇక సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అని కార్యకర్తలు నినదించారు. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఎంపీ రాహుల్ గాంధీతో పాటు సీనియర్ నాయకులందరూ పాల్గొన్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#WATCH | Congress flag falls off while being hoisted by party’s interim president Sonia Gandhi on the party’s 137th Foundation Day#Delhi pic.twitter.com/A03JkKS5aC
— ANI (@ANI) December 28, 2021