సాధారణంగా నేషనల్ హైవే పై జనాలు గుమి కూడితే అక్కడ ఏదో పెద్ద యాక్సిడెంట్ అయి ఉంటుందని అందరం వెళ్లి చూస్తుంటాం.. కానీ అక్కడ సీన్ చూసి జనాలు ముక్కున వేలు వేసుకొని వింతగా ఆ దృశ్యాన్ని చూస్తుండిపోయారు. ఎందుకో తెలుసా? ప్రతిరోజూ వేలాది వాహనాలు, ప్రజలు తిరిగే జాతీయ రహదారిపై వందల సంఖ్యలో కండోమ్‌లు కుప్పలు తెప్పలుగా పడి ఉండటం… అందరినీ ఆశ్చర్య పరిచింది.
కర్ణాటక తుముకూర్ శివారులోని జాతీయ రహదారి 48పై వందల సంఖ్యలో కండోమ్ లు పడి ఉండటంపై రక రకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీరాజ్ థియేటర్‌కు ఎదురుగా ఉన్న ఓ ఫ్లైఓవర్‌పై కండోమ్‌లు కుప్పలుగా కనిపించాయి. అయితే ఇవి ఎవరైనా కావాలని వేసి ఉంటారా.. లేక ఏదైనా వాహనం నుంచి జారి పడిపోయి ఉంటాయా అన్న విషయం తెలియాల్సి ఉంది.
ఇందులో కొన్ని వినియోగించిన కండోమ్ లు ఉండగా.. మరికొన్ని ప్యాకెట్లలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాకపోతే ఈ విషయం పై ఇప్పటి వరకు అధికారులు మాత్రం స్పందించలేదు. హైవే పై ఏంటీ దరిద్రం అంటూ..వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.
ರಾಷ್ಟ್ರೀಯ ಹೆದ್ದಾರಿಯಲ್ಲಿ ಕಿಲೋಮೀಟರ್ ಗಟ್ಟಲೆ ಕಾಂಡೋಮ್ಗಳುhttps://t.co/JPql1oAEVihttps://t.co/ETbtYSNVo2#Vishwavani #KannadaNews #KannadaDaily #Condom #Tumkur pic.twitter.com/bxVPXhzcRE
— Vishwavani (@VishwavaniNews) September 8, 2021