యువతీ యువకుల జీవితాల్లో పెళ్లి అనేది ఒక మధురమైన ఘట్టం. ఎన్నో ఆశలతో వారి వైవాహిక జీవితాలను ప్రారంభిస్తారు. కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ అన్యోన్యంగా జీవించాలని కోరుకుంటారు. ఆదర్శ దంపతులుగా పేరొందాలని సంసార జీవితంలో వచ్చే ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతారు. అయితే ప్రస్తుత కాలంలో పెళ్లైన జంటలు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ నూరేళ్ల జీవితాన్ని అర్థాంతరంగా ముగిస్తున్నారు. అదనపు కట్నం కోసమని, అక్రమసంబందాలు, ఆర్థికపరమైన విషయాలతో వివాదలు చెలరేగడంతో మూడుమూళ్ల బంధం మున్నాళ్ల ముచ్చటగా మారిపోతోంది.
పూర్వకాలం నుంచి పోల్చుకుంటే ఇప్పుడున్న తరం వారు పెళ్లిల్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వారికి తగిన వధూవరులను ఎంపిక చేసుకుంటున్నారు. అయినప్పటికి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న వివాహమై కొన్నేల్లు గడిచిన తరువాత ఇరువురి మధ్యన మనస్పర్థలు తలెత్తడంతో వివాహబందానికి స్వస్తి చెప్పి విడిపోతున్నారు. కాగా ఓ వివాహిత తన భర్త సంవత్సర కాలంగా తనతో శృంగారం చేయడం లేదని పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకాలోని మాండ్యా జిల్లాకు చెందిన యువతికి, హస్సాన్ జిల్లాకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది.
ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఆ యువకుడు బెంగళూరులోని ఓ సంస్థలో సెక్యూరిటీ సూపర్ వైసజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆమె ఇంట్లోనే ఉంటోంది. అయితే పెళ్లి తరువాత ఆ భర్త తన భార్యను దూరం పెట్టసాగాడు. దీంతో ఆమె ఎన్నో ఆశలతో వివాహబందంలోకి అడుగుపెట్టగా తన భర్త ఆనందం లేకుండా చేస్తున్నాడని పోలీసులకు తెలిపింది. సంవత్సర కాలంగా సంసారం చేయడంలేదని తెలిపింది. తన పట్ల చిరాకుగా వ్యవహరిస్తున్నాడని, ఇద్దరి మనసులు కలవట్లేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.