సృష్టిలో ప్రతి ప్రాణికీ మూల కారణం అమ్మ. అందుకే తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు. అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది. దేవుడికి బదులుగా ఈ భూమిపై అమ్మను సృష్టించారు అంటారు.
తల్లిదండ్రులకు తమ కుమారుడు మంచి ప్రయోజకుడు అయితే.. ఎంత గొప్ప అనందమో మాటల్లో చెప్పడం కష్టం. ఈ ఆనందాన్ని ప్రస్తుతం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ని చూసి ఆయన తల్లి ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోయింది. చాలా కాలం తర్వాత తన మాతృమూర్తిని కలిసిన యోగీ ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమెను కలవడం ఇదే మొదటిసారి.
మంగళవారం ఉత్తరాఖాండ్ లో పౌరీలో ఆయన తన తల్లిని కలిసి కాసేపు ముచ్చటించి బాగోగులు తెలుసుకున్నాడు. సీఎం యోగి ఆయన మేనళ్లుడికి సంబంధించిన ఓ ఫంక్షన్ కి హాజయ్యారు. ఈ సందర్భంగా అమ్మ పాదాలకు నమస్కరించి దీవెనలు అందుకున్నారు. ఈ ఫోటోను ఆయన ట్విట్టర్ లో పంచుకున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
माँ pic.twitter.com/3YA7VBksMA
— Yogi Adityanath (@myogiadityanath) May 3, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.