ఈ మద్య చాలా మంది ఈజీ మనీ కోసం వెంపర్లాడుతున్నారు. గౌరవమైన వృత్తిలో ఉంటూ కూడా కొంత మంది కాసులకు కక్కుర్తి పడుతున్నారు. ఇటీవల ఎగ్జామ్ పేపర్ లీక్ చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు కేటుగాళ్ళు. పేపర్ లీకేజ్ కేసుల్లో ఎక్కువ మంది ఉపాధ్యాయులే ఉంటున్నారు.
ఇటీవల కొంతమంది ఈజీ మనీ కోసం ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. ఒక గౌరవమైన వృత్తిలో ఉంటూ డబ్బులకు కక్కుర్తి పడి క్వచ్చన్ పేపర్ లీక్ చేస్తున్న కొంతమంది ఉపాధ్యాయులు పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం పాటుపడాల్సిన ఉపాధ్యాయులు నీచమైన పనులు చేస్తూ నేరస్థులుగా మారిపోతున్నారు. తాజాగా పదవతరగతి ప్రశ్నా పత్రం లీక్ అయ్యింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ వైఫల్యం తమదే అని.. ఇది మా తప్పు అంటూ సాక్షాత్తు సీఎం ఓ కీలక ప్రకటన చేశారు. ఏక్కడ పేపర్ లీక్ అయ్యింది.. ఆ ముఖ్యమంత్రి ఎవరు అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..
ఈ మద్య దేశ వ్యాప్తంగా పలు చోట్ల పది, ఇంటర్, డిగ్రీ పరీక్షల సమయంలో పేపర్ లీక్ కావడం చూస్తూనే ఉన్నాం. ఎంతో కష్టపడి చదువుకున్న విద్యార్థులు అసంతృప్తికి గురి అవుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా అసోం లో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ కావడంపై ముఖ్యమంత్రి హింత బిశ్వ శర్మ సంచలన ప్రకటన చేశారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యం అని.. తప్ప తమవల్ల జరిగిందని తాను అంగీకరిస్తున్నట్లుగా స్పష్టం చేశారు. పేపర్ లీక్ వెనుక ఉన్న అసలు సూత్రదారులను గుర్తించామని గురువారం వెల్లడించారు.
అసోం లో పదో తరగతి పరీక్షా పేపర్ లీక్ సంచలనం రేపింది. సోమవారం (మార్చి 13) న జరగవలసిన సైన్స్ ఎగ్జామ్ పేపర్ ఆదివారం రాత్రే బయటకు వచ్చింది. దీంతో రాష్ట్రం అంతా గందరగోళం ఏర్పడింది. సైన్స్ పేపర్ లీకేజ్ విషయాన్ని అసోం బోర్డ్ ఆఫ్ సెకండరీ అధికారులు గుర్తించారు. వెంటనే పరీక్ష రద్దు చేశారు. ఈ ఎగ్జామ్ తిరిగి మార్చి 30 న నిర్వహించాలని నిర్ణయించారు. దీనిపై సీఐడీ అధికారులు ముమ్మర దర్యాప్తు చేశారు. ఈ ప్రశ్నా పత్రాలను ఆదివారం రోజునే వాట్సాప్ గ్రూప్స్ లో లీక్ చేసినట్లు గుర్తించారు. ఒక్కో ప్రశ్నా పత్రాన్ని రూ.100 నుంచి రూ.3000 వరకు అమ్మినట్లు తెలుస్తుంది.
పేపర్ లీక్ ఘటనలో ఇప్పటి వరకు 12 మంది విద్యార్థులతో సహా 25 మందిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో కొంతమంది ప్రభుత్వ అధికారులు సైతం ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నిందితులను స్థానిక కోర్టులో హాజరు పరిచామని తెలిపారు. పేపర్ లీకేజ్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని అసోం డీజీపీ జ్ఞనేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు. తమ స్వార్థం కోసం విద్యార్థుల జీవితాలతో ఆడుకునేవారిని కఠినంగా శిక్షిస్తామ్ని అన్నారు.