యువతులు విద్యా, ఉద్యోగం, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నారు. ఐఎఎస్, ఐపిఎస్ వంటి ఉద్యోగాలను సైతం సాధిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన సివిల్ సర్వీసెస్-2022 తుది ఫలితాల్లో అమ్మాయిలే తొలి నాలుగు ర్యాంకులను సొంతం చేసుకున్నారు.
యువతులు విద్యా, ఉద్యోగం, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నారు. ఐఎఎస్, ఐపిఎస్ వంటి ఉద్యోగాలను సైతం సాధిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన సివిల్ సర్వీసెస్-2022 తుది ఫలితాల్లో అమ్మాయిలే తొలి నాలుగు ర్యాంకులను సొంతం చేసుకున్నారు.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 తుది ఫలితాలను ప్రకటించింది. సివిల్స్-2022 ఫలితాల్లో ఇషితా కిషోర్ దేశంలోనే టాప్ ర్యాంకర్ గా నిలిచారు. దీంతో ఆమెపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే సివిల్స్ ఫస్ట్ ర్యాంకర్ గా నిలిచిన ఇషితకు హైదరాబాద్‌తో అనుబంధం ఉన్నట్లు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె వెల్లడించింది. తాను హైదరాబాద్‌లోని బేగంపేటలో జన్మించానని ఇషితా కిషోర్ తెలిపారు. సివిల్స్ పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. దేశానికి సేవ చేయాలని నేను ఎప్పుడూ కోరుకుంటున్నానని, అందుకే నేను ఐఎఎస్ ని ఎంచుకున్నాను అని తెలియజేసింది. బీహార్‌కు రాష్ట్రానికి చెందిన ఇషిత కిషోర్ ప్రస్తుతం యూపిలో నివసిస్తున్నారు. ఇషిత తల్లిదండ్రులిద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగులే. తండ్రి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ కాగా, తల్లి రిటైర్డ్ టీచర్.
యూపీఎస్సీ దేశ వ్యాప్తంగా 933 అభ్యర్థులను ఎంపిక చేసి ర్యాంకులను వెల్లడించింది. ఎంపికైన మొత్తం అభ్యర్థులో ఐఎఎస్ కు 180 మందిని, ఐపిఎస్ కు 200మందిని, ఐఎఫ్ఎస్ కు 38 మందిని ఎంపిక చేసింది. ఇక సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఎకు 473 మందిని, గ్రూప్ బి కు 131 మందిని ఎంపిక చేసింది. మొత్తం 345 మంది జనరల్ కోటాలో ర్యాంకులు సాధించారు. ఇక 99 మంది ఈడబ్య్లఎస్ కోటాలో, 263 మంది ఒబిసి కోటాలో, 154 మంది ఎస్సీ కోటాలో, 72 మంది ఎస్ టి కోటాలో 2022 సివిల్ సర్వీసులకు ఎంపికయ్యారు. గరిమా లోహియా రెండో ర్యాంకు, ఉమా హారతి మూడో ర్యాంకు, స్మృతి మిశ్రా నాలుగో ర్యాంకు సాధించారు. ఉమా హారతి తెలంగాణకు చెందిన అమ్మాయి. ఆమె నారాయణపేట ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు కుమార్తె.