దేశ రాజధానిలోని ఆనంద్ విహార్ మెట్రో స్టేషన్‌లో ఓ నిండు గర్భిణి మహిళా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు పురిటి నొప్పులు రావడంతో వెంటనే అలర్ట్ అయిన సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది.. ఇతర మహిళా ప్రయాణికుల సహాయంతో పురుడు పోశారు. మూడో నంబర్ ప్లాట్ ఫామ్ పై మెట్రో కోసం వేచి ఉన్న మహిళకు ఉన్నట్టుండి నొప్పులు వచ్చి ఇబ్బంది పడటం గమనించిన అక్కడి సిబ్బంది వెంటనే పై అధికారులకు తెలియజేయశారు. షిఫ్ట్ ఇన్ చార్జి సూచనల మేరకు సీఐఎస్‌ఎఫ్ గార్డు అనామిక కుమారి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న కొంత మంది ప్రయాణీకుల సహాయంతో ఆమెకు డెలివరీ చేశారు.
ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయని.. గర్భిణిగా ఉన్న సమయంలో ప్రయాణాలు చేయడం అంత మంచిది కాదని అన్నారు అధికారులు. ప్రస్తుతం తల్లి పిల్లా ఇద్దరూ క్షేమంగా ఉన్నారని.. గర్భిణి విషయంపై వెంటనే స్పందించి అవసరమైన సహాయం అందించినందుకు సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి మహిళ .. ఆమె భర్త కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Prompt response and needful assistance by #CISF personnel helped a lady with labour pain to undergo an emergency delivery @ Anand Vihar ISBT, Metro Station. The mother along with newborn baby shifted to Hospital.#PROTECTIONandSECURITY with #HUMANITY@HMOIndia @MinistryWCD pic.twitter.com/J3JfcJgS4O
— CISF (@CISFHQrs) April 7, 2022