ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ ప్రమాదం జరగటానికి సిగరెట్ లైటర్ కారణమని కొందరు భావిస్తున్నారు. అధికారుల నుంచి పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.
ప్రమాదం ఎప్పుడు ఎక్కడినుంచి ముంచుకు వస్తుందో ఎవ్వరమూ చెప్పలేము. భూమ్మీద నూకలు ఉంటే ప్రాణాలు నిలుస్తాయి. లేదంటే ఆ ప్రమాదంలోనే ప్రాణాలు పోతాయి. అదృష్టం పడిశం పట్టినట్లు పట్టిన వాళ్లు.. కొన్ని సార్లు పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి కూడా చాలా సులభంగా తప్పించుకుంటూ ఉంటారు. అలా ప్రమాదాలనుంచి ఎంతో సురక్షితంగా బయటపడ్డ వారికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూ ఉంటాయి. తాజాగా, స్పెయిన్‌కు చెందిన ఓ వ్యక్తి సెకన్ల తేడాతో ప్రాణాలు నిలుపుకున్నాడు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. స్పెయిన్‌కు చెందిన ఓ వ్యక్తి తన బట్టలు శుభ్రం చేసుకోవటానికి పబ్లిక్ లాండ్రోమ్యాట్‌కు వెళ్లాడు. బట్టలు శుభ్రం చేసుకోవటం అయిపోగానే వాటిని తన బ్యాగుల్లో నింపుకుని బయటకు వెళ్లిపోయాడు. సరిగ్గా ఆరు సెకన్ల తర్వాత ఓ వాషింగ్ మిషిన్ డోర్ ఒపెన్ అయింది. ఆ వెంటనే పెద్ద శబ్ధంతో భారీ పేలుడు సంభవించింది. దీంతో రూము అద్దాలు ముక్కలయ్యాయి. ఒక రకంగా ఆ రూములో పెను విధ్వంసం జరిగింది. ఈ పేలుడు ఎందుకు సంభవించిందన్న దానిపై పూర్తి క్లారిటీ లేదు.
అయితే, వాషింగ్ మిషిన్‌లో వేసిన బట్టల్లో సిగరెట్ లైటర్ ఉండటం కారణంగానే ఈ పేలుడు సంభవించిందని కొందరు భావిస్తున్నారు. అధికారులు పేలుడుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ అదృష్ట వంతుడు.. ఆరు సెకన్లు ఉంటే ప్రాణాలు పోయేవి’’.. ‘‘ పొద్దున్నే నక్క తోక తొక్కినట్లు ఉన్నాడు’’.. ‘‘దేవుడే అతడి ప్రాణాలు కాపాడాడు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Someone didn’t check their pockets pic.twitter.com/MjpK5mPba7
— OnlyBangers (@OnlyBangersEth) April 2, 2023