దేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి సీఎం సోదరి అయిన ఓ మహిళ సాధారణ టీ కొట్టు నడుపుతూ తన జీవితాన్ని సాగిస్తుంది. తలచుకుంటే కార్లు, బంగ్లాలు విలాసవంతమైన జీవితం అనుభవించొచ్చు. కానీ నిరాడంబరంగా జీవితాన్ని గడుపుతున్న ఆ మహిళ గురించి తెలుసుకుందాం.
ప్రస్తుత కాలంలో రాజకీయ నాయకులు ప్రజల అవసరాలకంటే ముందుగా తమ స్వలాభాలనే చూసుకుంటున్నారు. చిన్న చిన్న నాయకులే రాజకీయాల్లోకి దిగి చాలా రాళ్లు వెనకేసుకుంటున్నారు. వారి కుటుంబసభ్యులతోపాటు వారి బంధువులను కూడా ఉన్నత స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. చిన్న గ్రామాల్లో సైతం వార్డు మెంబర్ ఫ్యామిలీ కూడా కార్లలో తిరుగుతూ స్టేటస్ చూపించుకుంటారు. ఆడంబరాలతో ఆర్బాటాలు చేస్తుంటారు. కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి అక్క అయిన మహిళ సదాసీదా జీవితం అనుభవిస్తుంది. తను ఓ చిన్న టీ కొట్టు నడుపుకుంటుంది. వారు తలచుకుంటే చిటికెలో వారి జీవితం మారిపోతుంది. కానీ అలా కాకుండా నిరాడంబర జీవితాన్ని కొనసాగిస్తుంది.ఇంతకీ ఆ మహిళ ఎవరు? అసలు ఆమె పూర్తి వివరాలు ఏంటి? అని ఆలోచిస్తున్నారా? అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే..
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోదరి పేరు శశి పాయల్. ఆమె ఉత్తరాఖండ్‌లోని పౌఢీలో నివాసముంటున్నారు. మాతా భువనేశ్వరి ఆలయ సమీపంలో ఓ టీ కొట్టు నడుపుతోంది. ఆ టీ దుకాణానికి వెళ్లాలంటే రోడ్లు సరిగా లేవు.. ఎగుడు దిగుడుగా గతుకుల రోడ్ల వెంబడి వెళ్లాలి. వర్షం పడితే ఇక చెప్పక్కర్లేదు. ఆ టెంపుల్ కు వెళ్లాలంటే రెండు కిలోమీటర్ల ముందే వాహనాలను నిలిపివేయాల్సి ఉంటుంది. అక్కడి నుండి నడక దారిన వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి గుడి ఆవరణంలో టీ దుకాణంతో జీవితాన్ని సాగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో భువనేశ్వరి మాత ఆలయానికి వెళ్లిన పర్యాటకులు శశిపాయల్ సీఎం అక్క అని తెలిసి అవాక్కయ్యారు. ఆమె దగ్గరకు వెళ్లి ఫొటోలు దిగి సందడి చేశారు.
ముఖ్యమంత్రి యోగితో ఆమెకున్న అనుభవాలను తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను మాజీ ఎమ్మెల్యే దినేశ్ చౌదరి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శశి పాయల్‌ను చూసి పర్యాటకులు చాలా ఆశ్యర్యపోయారు. ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా సరే.. తన తమ్ముడు సీఎం అన్న గర్వం ఆమెలో ఎంతమాత్రం లేదన్నారు. ఇక్కడికి వచ్చేంతవరకు ఈ విషయం చాలామందికి తెలియదని తెలిపారు. అదే స్థానంలో వేరొకరు ఉంటేనా.. ముఖ్యమంత్రి అక్కఅనే అహంబావం చూపేవారు. కార్లలో లగ్జరీగా తిరిగి కోట్ల రూపాయలు కూడబెట్టుకునేవారు. కానీ వారు చాలా నిరాడంబర జీవితం అనుభవిస్తున్నారు. వారి జీవితాలను రాజకీయాలకు దూరంగా ఉంచి.. ప్రజాసేవకే యోగి అంకితమయ్యారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెట్స్ రూపంలో తెలియజేయండి.