సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సోషల్ మీడాయాపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శనివారం రాంచీలో జరిగిన ఉపన్యాస కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన సోషల్ మీడియాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ పాత్ర, న్యాయమూర్తుల ముందున్న సవాళ్లపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
సోషల్ మీడియాలో న్యాయమూర్తులకు వ్యతిరేకంగా క్యాంపైన్ జరుగుతోందని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో వచ్చే వాటిపై న్యాయమూర్తులు వెంటనే స్పందించాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. దయచేసి దీనిని బలహీనతగానో, నిస్సహాయతగానో పొరబడకండని న్యాయమూర్తులకు జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. రాజకీయాల్లో చేరాలనుకున్నట్లు తెలియజేశారు. కానీ విధి వేరే దారిచూపిందన్నారు. న్యాయమూర్తి అయినందుకు బాధపడటం లేదని పేర్కొన్నారు. సీజేఐ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.