దేశానికి రైతే వెన్నుముక. మరి అలాంటి రైతుకు పశు సంపదే ఆధారం. ముఖ్యంగా ఆవులు, ఎద్దులు, గేదెలు వంటి పశు సంపదను ఆధారంగా చేసుకుని రైతలు వ్యవసాయం చేస్తుంటారు. ఈ క్రమంలో రైతుల ఆర్థిక స్థితిగతులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తుంటాయి. రైతుల వద్ద లభించే ఉత్పత్తులను స్వయంగా ప్రభుత్వాలు కొనుగోలు చేస్తూ రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. కొన్ని ప్రభుత్వాలు అయితే పశువు ద్వారా వచ్చే ఉత్పత్తులను కూడా కొనుగోలు చేస్తున్నాయి. తాజాగా మూత్రం కొనుగోలు చేసేందుకు ఓ రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. ఆ మేరకు కీలక ఉత్తర్వూలు జారీ చేసింది. మరి.. గోమూత్రం కొంటున్న ఆ రాష్ట్రం, మూత్రం లీటర్ ఎంతకు కొంటున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
రైతుల ఆర్థిక స్థితిగతులను బలోపేతం చేసేందుకు ఛత్తీస్ గడ్ ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చింది. అందులో ప్రధానమైనది “గోధన్ న్యాయ్ యోజన” పథకం. ఈ పథకం కింద నుంచి పశువుల పేడను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. అయితే ఇప్పుడు గోమూత్రం కూడా సేకరించాలని ఛత్తీస్ గడ్ ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం ప్రారంభం కానుంది. ఆవు మూత్రాన్ని లీటర్ రూ.4 చోప్పున రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కార్యచరణ రూపొందిస్తుంది. త్వరలో ఈ ఫైల్ పై సీఎం భూపేష్ బఘేల్ సంతకం చేయనున్నారు.
సీఎం ముద్ర రాగానే పథకం అమలు చేస్తామని అధికారులు తెలిపారు. “విలేజ్ గౌతన్ సమితి” ద్వారా ఈ గోమూత్రాన్ని సేకరించి, పశువుల పెంపకందారులకు పక్షం రోజులకు ఒకసారి డబ్బులు చెల్లిస్తారు. మరి.. గో మూత్రం కొనుగోలు చేయాలని ఛత్తీస్ గడ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Bhadrachalam: భద్రాచలం వరదల్లో కొత్త కష్టం! సామాను ఎత్తుకెళ్తున్న దొంగలు!
ఇదీ చదవండి: Vidoe: చనిపోయాడు అనుకున్న వ్యక్తికి.. CPR చేసి ప్రాణాలు నిలిపిన పోలీస్.. నెటిజన్ల ప్రశంసలు!
ఇదీ చదవండి: R Bindu: కిడ్నీ పేషెంట్‌ని చూసి చలించిన మహిళా మంత్రి.. ఆమె చేసిన పనిపై ప్రశంసలు!