సాధారణంగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవారు ఎక్కడికి వెళ్లినా.. చుట్టూ అధికారులు, పార్టీ నేతలు, కార్యకర్తలతో హంగూ.. ఆర్భాటాలు ఎంతో గొప్పగా ఉంటాయి. సీఎం హోదాలు ఏదైనా కార్యక్రమాలకు వెళితే గట్టి బందోబస్తు ఉంటుంది. కానీ ఒక ఆలయంలో మాత్రం ముఖ్యమంత్రి కొరడా దెబ్బలు తిన్నాడు. వింటానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బాఘెల్ దీపావళి పండుగ రోజు జజంగిరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత కొరడా దెబ్బలు తిన్నారు.
గత రెండేళ్లుగా కరోనా వైరస్ ప్రభావంతో ఎక్కడ కూడా పండుగలు జరుపుకోలేదు. ఈ ఏడాది కరోనా ప్రభావం తగ్గడంతో అందరూ ఎంతో సంతోషంగా పండుగలు నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ప్రజలు దీపావళి వేడుకులను ఆనందోత్సాహాల మద్య జరుపుకున్నారు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్ లో దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. సీఎం భూపేష్ బాఘెల్ పండుగ సందర్భంగా మంగళవారం ఉదయం జజంగిరి ఆలయంలో గౌరీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కొరడా దెబ్బలు తిన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
దీపావళి పండుగ రోజు ఇలా కొరడా దెబ్బలు తింటే ఎలాంటి విఘ్నాలు ఉన్నా తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారని ప్రజల విశ్వాసం. ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ గౌరీదేవి పూజా కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ప్రజలు సుభీక్షంగా ఉండాలని ప్రార్థించారు. ఆ తర్వాత జరిగే తంతులో భాగంగా ఓ వ్యక్తితో కొరడా దెబ్బలు కొట్టించుకున్నారు. ప్రతి ఏటా దీపావళి రోజున గోవర్థన్ పూజలో ఆయన పాల్గొంటూ ఉంటారు. ఇక్కడ ఆచారాలు, సాంప్రదాయాలు ఆయన పాటిస్తుంటారు.
सोंटे का प्रहार और परंपराओं का निर्वहन. pic.twitter.com/SV82qommmu
— Bhupesh Baghel (@bhupeshbaghel) October 25, 2022