దేశంలో నెలకొన్న ప్రధాన సమస్యల్లో ఒకటి నిరుద్యోగం. చదువుకున్న చదువుకు ఉద్యోగం రాక .. పెద్ద మొత్తంలో యువత నిరుద్యోగులుగా మిగులుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ లేకపోవడంతో పాటు ప్రైవేటు సంస్థల్లో ఉపాధి అవకాశాలు లేక దేశంలో నిరుద్యోగిత రేటు నానాటికి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నెలవారీ భృతి ఇవ్వనున్నట్లు తెలిపింది.
ఆ రాష్ట్రమే చత్తీస్‌గఢ్. వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వనన్నట్లు ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ప్రకటించారు. కాగా, ఈ ఏడాది ఆఖర్లో చత్తీస్‌గఢ్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ కీలక ప్రకటన చేయడం గమనార్హం. కాగా, 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన కీలక వాగ్థానాలతో ఇది ఒకటి. అయితే 15 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ చత్తీస్‌గఢ్ లో అధికారాన్నిచేపట్టింది. రిపబ్లిక్ డే సందర్భంగా బస్తర్ జిల్లా ప్రధాన కార్యాలయం జగదల్ పూర్ లో లాల్ భాగ్ పరేడ్ మైదానంలో జెండా ఆవిష్కరణ చేసిన ఆయన అనంతరం ప్రజలనుద్దేశించి ముఖ్య మంత్రి ప్రసంగించారు.
నిరుద్యోగ యువతకు నెలవారీ భృతి కల్పించడంతో పాటు రాయ్ పూర్ ఎయిర్ పోర్టులో ఏరోసిటీ ఏర్పాటు, కార్మికులకు గృహ నిర్మాణ సహాయ పథకం, మహిళలకు కోసం ప్రోత్సహాక పథకం వంటివి ప్రకటించారు. కుటీర పరిశ్రమలను బలోపేతం చేసేందుకు రాష్ట్రంలో గ్రామీణ పరిశ్రమల విధానాన్ని రూపొందించనున్నట్లు తెలిపారు. పరిశ్రమల శాఖ అభివృద్ధి చేసే పారిశ్రామిక ప్రాంతాల్లో ఏర్పాటు చేసే కర్మాగారాలకు ఆస్తి పన్నుమినహాయిస్తామని భూపేష్ బఘేల్ ప్రకటించారు.