ప్రెగ్నెంట్ గా ఉన్న తన భార్యను చూడటానికి వచ్చాడు ఓ ఆర్మి జవాన్. వారం రోజులు తన కుటుంబంతో సంతోషంగా గడుపుదాం అనుకున్నాడు. కానీ నక్సల్స్ చేతికి చిక్కి..
29 సంవత్సరాలు ఉన్న ఓ జవాన్.. గర్భిణీగా ఉన్న తన భార్యను చూడటానికి ఊరికి వచ్చాడు. వారం రోజులు సెలవులు పెట్టి కుటుంబంతో సరదాగా గడుపుదామని వచ్చిన ఆ జవాన్ తిరిగి మళ్లీ డ్యూటీకి వెళ్లలేదు. ఎంతో సంతోషంతో మరికొన్ని రోజుల్లో తనకు బిడ్డ పుట్టబోతున్నాడన్న సంతోషాన్ని అనుభవించకుండానే ఈ లోకాన్ని విడిచివెళ్లాడు. ఈ విషాద సంఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని కంకేర్ జిల్లా ఉసేలి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ విషాద సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
అది ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని కంకేర్ జిల్లా ఉసేలి గ్రామం. ఈ గ్రామంలో 29 సంవత్సరాలు ఉన్న ఓ జవాన్.. గర్భిణీగా ఉన్న తన భార్యను చూడ్డానికి వారం రోజులు సెలవులు పెట్టి వచ్చాడు. ఈ వారం రోజులు తన కుటుంబంతో సంతోషంగా, సరదాగా గడుపుదాం అని ఆ జవాన్ కలలు కన్నాడు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం షాపింగ్ చేసేందుకు గ్రామంలోని మార్కెట్ కు వెళ్లాడు. ఆ మార్కెట్ కు వచ్చిన ఇద్దరు నక్సల్స్ అతి సమీపం నుంచి జవాన్ తలపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు.
దాంతో ఆ జవాన్ అక్కడికక్కడే చనిపోయాడు. జవాన్ సోదరుడు, గ్రామస్తులు చూస్తుండగానే ఈ ఘటన జరగడం గమనార్హం. కాల్పుల అనంతరం మావోయిస్టులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే మావోయిస్టులు సాధారణంగా ఆర్మీ జవాన్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయరని ఓ విశ్రాంతి అధికారి తెలిపారు. గర్భిణీగా ఉన్న భార్యను చూడటానికి వచ్చి తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఆ జవాన్ ను చూసి ఊరుఊరంత కన్నీరు మున్నీరుగా ఏడ్చారు.